కడప

అధ్వాన్నంగా పెద్దజొన్నవరం రోడ్డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజుపాళెం, జూలై 4: వెలవలి-తొండలదినె్న గ్రామాల మధ్య నుండి కుందూనది మీదుగా పెద్దజొన్నవరం, ఎంకుపల్లె నుండి జాతీయ రహదారికి అనుసంధానం చేసిన రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. గతంలో ఎప్పుడో కుందూనదిపై బ్రిడ్జి నిర్మించాక ఈ గ్రామాల మధ్య నుండి కడప-కర్నూలు జాతీయ రహదారి వరకు తారురోడ్డు నిర్మించారు. ఆ తర్వాత ఆ రోడ్డు స్థితిగతుల గురించి పంచాయతీరాజ్ అధికారులు పట్టించుకోలేదు. ప్రతినిత్యం రాజుపాళెం మండల పరిది నుండి మండల కేంద్రమైన దువ్వూరుకు అనుసంధానంగావున్న ఈ పెద్దజొన్నవరం రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. వర్షాకాలంలో వర్షపునీరు గుంతల్లో నిల్వవుండి పాడైపోయింది. ప్రతినిత్యం ట్రాక్టర్ల ద్వారా పంటపొలాలకు వెళ్లు రైతులు, ద్విచక్ర వాహనదారులు ఈ రహదారి గుండా ప్రయాణిస్తూ వుంటారు. జాతీయ రహదారికి, మండల కేంద్రమైన దువ్వూరుకు అనుసంధానంగా వుండడంతో ఎక్కువగా రాకపోకలు జరుగుతూ వుంటాయి. గతంలో ప్రొద్దుటూరు డిపో నుండి ఆర్టీసీ బస్సులు కూడా ఈ గ్రామాలకు నడిచేవి. గుంతలమయంగా మారిన రోడ్డుకు సంబంధిత అధికారులు మరమ్మత్తులు చేయకోవడంతో ఆ రహదారి గుండా వెళ్లాలంటే వాహనదారులు కష్టపడాల్సి వస్తోంది. ఎప్పుడో వేసిన తారురోడ్డును తిరిగి వేయకపోవడంతో గుంతలుగా ఉన్న రోడ్డును గుంతలు బూడ్చి, కొత్తగా తారురోడ్డు వేయాలని ఇక్కడి ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేసుకుంటున్నారు.