కడప

ముస్లింల సంక్షేమానికి సీఎం పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, జూలై 4: రాష్ట్రంలోని ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పెద్దపీట వేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా కార్యదర్శి సుజాత పేర్కొన్నారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే, రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి రమేష్‌కుమార్‌రెడ్డి ఆదేశానుసారం మునిసిపాలిటీ పరిధిలోని 24వ వార్డులోని చౌకదుకాణ కేంద్రంలో ముస్లింలకు రంజాన్ తోఫాను జిల్లా మహిళా టీడీపీ ప్రధాన కార్యదర్శి సుజాత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని ముస్లింలకు ఏ ప్రభుత్వం చేయని విధంగా అనేక సంక్షేమ పథకాలను సీఎం ప్రవేశపెట్టాన్నారన్నారు. పేద ముస్లిం యువతుల వివాహానికి రూ.50 వేలు అందించే దుల్హన్ పథకం వలన వారు సుఖంగా జీవించేందుకు ఆస్కారం ఉందన్నారు. అదే విధంగా రాష్ట్రంలోని మసీదుల మరమ్మతుల కొరకు కానీ, ఇమాం, వౌజంలకు గౌరవవేతనం అందించే విషయంలో కూడా సీఎం కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి చొరవతో రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా అనేక ఈద్గాల మరమ్మతులకు నిధులను విడుదల చేశారన్నారు. అంతేకాకుండా త్వరలోనే ఇమామ్, వౌజమ్‌లకు గౌరవవేతనాన్ని కూడా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆమె తెలిపారు. ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతోనే సీఎం చంద్రబాబు రంజాన్‌తోఫాను పేద ముస్లింలకు అందజేస్తున్నారన్నారు. ముస్లింల అభివృద్ధికి, సంక్షేమానికి సీఎం కృతనిశ్చయంతో పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్‌తో కొట్టుమిట్టాడుతున్నా రాష్ట్ర ప్రజల శ్రేయస్సే పరమావధికి సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు. ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి ప్రతిపక్ష పార్టీల నాయకులు లేని ఆరోపణలు, నిందలు వేయడం వారికి తగదన్నారు. ఈ కార్యక్రమంలో వీరభద్రస్వామి ఆలయ కమిటీ మెంబర్ గురవయ్య, టీడీపీ జిల్లా మహిళా కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి, డీలర్ హర్ష, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ముస్లింలు పాల్గొన్నారు.