కడప

రామ్‌నగర్‌లో కమిషనర్ మార్నింగ్ వాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, జూలై 4:రాజంపేట మున్సిపాలిటీలోని 6వ వార్డు రామ్‌నగర్ ఏరియాలో సోమవారం ఉదయం కమిషనర్ ఎన్‌వి రమణారెడ్డి, మున్సిపల్ సిబ్బంది మార్నింగ్ వాక్ నిర్వహించి, ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యలను గుర్తించడంతో పాటు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను విచారించారు. ప్రజలకు సరఫరా అవుతున్న తాగునీటి పథకాలను ఆయన పరిశీలించారు. వీధులలోని ఖాళీ ప్రదేశాలలో పెరిగిన పిచ్చిమొక్కలను సిబ్బందిచే తొలగించారు. అలాగే ఖాళీ స్థలాల యాజమానులకు స్థలాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. వీధులలోని డ్రైనేజి కాలువలలో పూడిక తీయించి మురుగునీరు సక్రమంగా పోయేలా చర్యలు తీసుకోవాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్ సింగ్‌ను ఆదేశించారు. పది రోజులకు ఒకసారి డెమాఫాస్ మందులను దోమల నివారణకు స్ప్రే చేయాలని, వర్షాకాలంలో ఇంటింటి చెత్తను పురపాలక రిక్షాల ద్వారా తొలగించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. చెత్తాచెదారాలను కాలువలలో, ఖాళీ ప్రదేశాలలో వేయడం ద్వారా మలేరియా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని కమీషనర్ ప్రజలకు వివరించారు. రామ్‌నగర్‌లో మరుగుదొడ్లు లేని వారు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకుంటే వెంటనే మంజూరు చేస్తామన్నారు. అనంతరం ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం పనితీరును, వాటర్ ట్యాంకులను కమీషనర్ పరిశీలించారు.
ఎలక్ట్రికల్ క్రిమిటోరియం పరిశీలన
రామ్‌నగర్ వార్డుల పర్యటనలో భాగంగా ఇక్కడ శ్మశానంలో నిర్మితమైన ఎలక్ట్రికల్ క్రిమిటోరియం పనులను కమిషనర్ రమణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా క్రిమిటోరియంకు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి, ప్రజలకు అందుబాటులోకి తేవాలని, సదరు ఆవరణలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాసులను కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ మోహన్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ హరనాధ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఆర్‌పివిఎన్‌ఎన్ సింగ్, మేస్ర్తి వెంకటయ్య, జన్మభూమి కమిటీ సభ్యులు టి.సంజీవరావు, ఎన్.విశ్వనాధాచారి, వడ్డెర శ్రీనివాసులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.