కడప

డ్వామాలో ఉద్యోగాలు భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 4: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం జిల్లాలో మండల, గ్రామపంచాయతీల వారీగా ఉద్యోగ భర్తీలకు రాష్ట్రప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో అధికారపార్టీ నేతల భర్తీకే పెద్దపీటవేయనున్నారు. అంతేగాకుండా జన్మభూమి కమిటీలకు గిరాకీ పెరిగి వారు నిర్ణయించిందే ఈ ఉద్యోగాల భర్తీ ఉండదు. మండల పరిషత్ అధికారి ధృవీకరిస్తూ జాబ్‌కార్డుకలిగి గతంలో మేట్‌గా పనిచేసి గత ఆర్థిక సంవత్సరంలో కనీసం 25రోజులు పనిచేసి వుండాలి. ఆధార్‌కార్డు, రేషన్ కార్డుల్లో పేరుసరిపడి వుండాలి. అభ్యర్థి 10వ తరగతి ఉత్తీర్ణులైనా తప్పినా అర్హులే. అభ్యర్థికి 18 నుంచి 35 సంవత్సరాలు కలిగివుండాలి. ఎస్సీ, ఎస్టీ, బిసిలకు 5సంవత్సరాలు సడలింపు ఉంటుంది. అభ్యర్థిపై ఎటువంటి కేసులు ఉండరాదు. జిల్లా వ్యాప్తంగా 50 మండలాల్లో 157 సీనియర్ మేట్‌లు, జూనియర్ మేట్లను భర్తీ చేయనున్నారు. గతంలో టెక్నికల్ అసిస్టెంట్లుగా, ఫీల్డ్ అసిస్టెంట్లుగా తొలగించబడినా ఇంతవరకు వారిని నియామకం చేయకుండా సీనియర్, జూనియర్‌మేట్‌లను మాత్రమే భర్తీ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో పనిచేసిన వారికి ఉద్వాసన పలికారు. ప్రస్తుతం మేట్ల భర్తీతో మళ్లీ డ్వామాలో సిఫార్సులు మొదలయ్యాయి. నియోజకవర్గాల వారీగా అధికారపార్టీ నేతలు తమ అనుచరగణాల జాబితాను సిద్దంచేసి డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌కు, జిల్లా కలెక్టర్లకు సిఫార్సులు కుప్పలు తెప్పలుగా ఇస్తున్నారు. దీంతో డ్వామా పిడి తలపట్టుకుంటున్నారు.