కడప

ఘనంగా సాయినాథునికి గురుపౌర్ణమి పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నూరు,జూలై 19: గురుపౌర్ణమి పురస్కరించుకుని స్థానిక బ్రాహ్మణవీధిలో వెలసిన శ్రీషిరిడిసాయినాథుని ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలో సాయిబాబా ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారు జాము నుంచి సాయినాథునికి అభిషేక పూజలు చేశారు. హోమం, గణపతి పూజ, పలు పూజలు నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి సాయినాథుని భక్తులు దర్శించుకునేందుకు ఆలయ కమిటీ ఏర్పాటు చేశారు. ఆలయ వ్యవస్థాపకులు నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు పూలాభిషేకం నిర్వహించారు. పరమటి వీధిలో వెలసిన సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చెన్నూరుకు కి.మీ దూరంలో ఉన్న కెఓఆర్ కాలనీలో వెలసిన సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. బ్రహ్మణవీధిలో వెలసిన సాయిబాబా ఆలయంలో సాయినాథుని గ్రామోత్సవం నిర్వహించారు. సాయిబాబా ఆలయాలు విద్యుత్‌దీపాలతో అందంగా అలంకరించారు.
వల్లూరులో..
వల్లూరు: గురుపౌర్ణమి పురస్కరించుకుని మండల కేంద్రంలోని సాయిబాబాకు వైభవంగా గ్రామోత్సవాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలో వెలసిన సాయిబాబా ఆలయంలో మంగళవారం గురుపౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం మహామంగళహారతి అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సాయినాథుని భజనలు, భక్తిగీతాలతో భక్తులు తన్మయత్వం చెందారు. సాయంత్రం సాయినాథుడికి గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి మహామంగళహారతి, పల్లకిసేవ నిర్వహించారు.
ఖాజీపేటలో...
ఖాజీపేట: మండలంలోని సాయిబాబా ఆలయాల్లో మంగళవారం ఉదయం నుంచి భక్తులు ఆలయాల్లో పాల్గొని గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 7గంటల నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరి ప్రత్యేక పూజలు, అర్చనలు చేయించారు. ఆలయ కమిటీ వారు భక్తులకోసం అన్ని ఏర్పాట్లుచేశారు. మైదుకూరు రోడ్డులోని సాయిబాబా ఆలయంలో ఆలయ కమిటీ భక్తులకు అన్నదానం ఏర్పాటుచేసింది. సాయిబాబాకు గురుపౌర్ణమి అత్యంతప్రీతికరమైన రోజుకావున ఈరోజున ప్రత్యేకపూజలు చేయడం వల్ల అనుకున్న కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. పిల్లలు, పెద్దలు, వృద్దులు రాత్రి వరకు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
చింతకొమ్మదినె్నలో...
చింతకొమ్మదినె్న: చింతకొమ్మదినె్న మండలం గోపాలపురం వద్ద వెలసివున్న అవధూత శ్రీశ్రీశ్రీ కోదండరామయ్యస్వామి ఆలయంలో మంగళవారం ఆషాఢ వ్యాసపౌర్ణమి పురస్కరించుకుని స్వామివారి గురుపూజ (తిరుణాల) కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈసందర్భంగా తెల్లవారుజామున స్వామివారికి సప్రభాతసేవ, శ్రీమహాగణపతి పూజ, కలశపూజ, శ్రీమహామంగళస్నానం, జపవాస్తు హోమాదులు, మహా పంచామృతాభిషేకం, అష్టాక్షరి మంత్రపుష్పం, ఆకుపూజ, విశేష అలంకరణ, హోమగుండ పూజ, మహానైవేద్యం నిర్వహించారు. ఉదయం నుంచి స్వామిని దర్శించుకునేందుకు జిల్లా నుంచే కాకుండా ఇతరప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బారులుతీరారు. స్వామిని దర్శించుకున్న అనంతరం కాయ, కర్పూరాలు సమర్పించి వారి మొక్కుబడులు తీర్చుకున్నారు. అలాగే ఉదయం 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మద్యాహ్నం 2గంటలకు గ్రామపెద్దల ఆధ్వర్యంలో వృషభరాజములచే బండలాగుడు పోటీలు నిర్వహించారు. అలాగే చెక్క్భజన బృందాల నాట్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాత్రికి స్వామివారి ఉత్సవ విగ్రహ గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహకులు కె.వెంకట కేశవయ్య, కె.గోవిందరాజాస్వామి, ఎస్.కొండయ్యలతోపాటు పలువురు గ్రామపెద్దలు పాల్గొన్నారు.