కడప

చైన్ స్నాచింగ్ దొంగల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(క్రైమ్)జూలై 19: కడప నగరంలోని మహిళల మెడలలో నుంచి గొలుసుదొంగతనాలకు పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు, వారు అమ్మిన వ్యక్తి నుంచి రూ.10లక్షలు విలువచేసే బంగారు గొలుసులు, మంగళసూత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు కడప డిఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం కడప వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్పీ ఆదేశానుసారం వన్‌టౌన్ సిఐ కె.రమేష్ నేతృత్వంలో ఎస్‌ఐ నాగరాజు, పిఎస్‌ఐలు భాస్కరరెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, ఏఎస్‌ఐ నౌషద్‌బాషా, పోలీసులను కోటిరెడ్డి సర్కిల్ వద్ద వాహనాలు తనిఖీ చేసేందుకు ఆదేశించినట్లు తెలిపారు. పోలీసులు తనిఖీ చేస్తుండగా మురళి థియేటర్ వైపు నుంచి బజాజ్ సిటీ 100లో మోటార్ సైకిల్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చారని పోలీసులను చూసి వారు పారిపోతుండగా వెంబడించి పట్టుకుని విచారించినట్లు తెలిపారు. వారిలో ఒకరి పేరు సాకే చంద్రశేఖర్ (25) అనే వ్యక్తి నాగరాజుపేటలోని నారాయణ జూనియర్ కాలేజి వెనుకవైపు నివసిస్తున్నట్లు, రెండవ వ్యక్తి కొత్తపల్లె కృష్ణాంజనేయులు (27) అనే వ్యక్తి కొర్నూతల అగ్రహారానికి చెందిన ఇతను ప్రస్తుతం ముత్రాసుపల్లెలో నివహిస్తున్నారు. వీరిని విచారించగా నగరంలోని బ్రాహ్మణవీధి, మారుతీనగర్, ఏపిహెచ్‌పి కాలనీ, ద్వారకానగర్, రాజీవ్ కట్ట, పిఎఫ్ కార్యాలయం, లా కాలేజివద్ద, భాగ్యనగర్ కాలనీల్లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడినట్లు తెలిపారన్నారు. దొంగలించిన బంగారు గొలుసులను నాగరాజపేటలోని సింగం గోవర్ధన్‌రెడ్డికి అమ్మినట్లు తెలిపారు. వారి వద్దనుంచి రూ.10లక్షలు విలువచేసే 30 తులాల బంగారు గొలుసులు, బజాజ్ సిటీ మోటార్ సైకిల్‌ను ఏపి 04బిఏ 9860బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈసమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.