కడప

పాఠశాల విద్యాకమిటీ ఎన్నికలు నిర్వహించండి : ఎంఇఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నూరు,జూలై 19: ఈనెల 26వ తేదీన చెన్నూరు మండలంలోని ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు పకడ్బంధీగా నిర్వహించాలని ఎంఇఓ కృష్ణమూర్తి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో ఉపాధ్యాయులతో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఎంఇఓ మాట్లాడుతూ ఆయా పాఠశాలలకు సంబంధించి విద్యాకమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యుల ఎన్నికలకు సంబంధించి ఈనెల 20న నోటిఫికేషన్ జారీ చేస్తారని, 26న మండలంలో అన్ని పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. పాఠశాలల తల్లిదండ్రుల కమిటీలో 9మంది కమిటీ సభ్యులు ఉంటారని ఈ కమిటీ సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ప్రధానోపాధ్యాయులు నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు బాలుర, బాలికల ప్రధానోపాధ్యాయురాలు అలివేలమ్మ, లక్ష్మీదేవి, కొండపేట జెడ్పి ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సిద్దవటంలో...
సిద్దవటం: పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికకు సంబంధించిన విధి విధానాలు చర్చించేందుకు ఎమ్మార్సీ భవన్‌లో పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశం జరిగినట్లు ఎంఇఓ పాలెం నారాయణ తెలిపారు. ఈసందర్భంగా ఎంఇఓ మాట్లాడుతూ ఈనెల 20,23, 26వ తేదీల్లో పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్, ఓటర్ల జాబితా తయారుచేసి ఎన్నికలు నిర్వహించాల్సివుంటుందన్నారు. ప్రతి తరగతి నుంచి ముగ్గురు చొప్పున సభ్యులుగా ఎన్నుకోవడం జరుగుతుందని ప్రాధమిక పాఠశాలల్లో 5 తరగతులకు గాను 15మంది సభ్యులు, ప్రాధమికోన్నత పాఠశాలల్లో 7 తరగతులకు 21 మంది సభ్యులు, ఉన్నత పాఠశాలల్లో 6,7,8 తరగతులకు గాను 9మంది సభ్యులను ఎన్నుకుంటారన్నారు. ఎన్నుకోబడిన సభ్యుల్లో చైర్ పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌ను ఎన్నుకుంటారని , 26న తొలి సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవీకాలం రెండుసంవత్సరాలు ఉంటుందన్నారు.
పెండ్లిమర్రిలో...
పెండ్లిమర్రి: మండల పరిధిలోని 19 గ్రామపంచాయతీల్లో ఉన్న 76 స్కూళ్లలో బుధవారం నుంచి స్కూల్ కమిటీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎంఇఓ సుజాత తెలిపారు. మంగళవారం ఎమ్మార్సీ కార్యాలయంలో మండలంలోని అన్ని ప్రధానోపాధ్యాయులకు సమావేశం ఏర్పాటుచేసి ఆమె మాట్లాడారు. బుధవారం నుంచి ఎన్నికల షెడ్యూల్ ఖరారైందని 20న స్కూల్‌లోని విద్యార్థుల యొక్క పేర్లు, తల్లిదండ్రుల పేర్లు నోటీసుబోర్డులో అతికించాలన్నారు. 21న నామినేషన్లు స్వీకరణ, 23న కమిటీ సభ్యుల ఎన్నిక, 26న వైస్ చైర్మన్, చైర్మన్ ఎన్నిక ఉంటుందని అదేరోజు ప్రమాణస్వీకారం, స్కూల్ కమిటీ సమావేశం ఏర్పాటుచేస్తామని చెప్పారు.