కడప

నిహారికకు నర్తనబాల అవార్డు ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కల్చరల్)జూలై 19: కడప నగరానికి చెందిన స్పందన డ్యాన్స్ అకాడమి చిన్నారి నిహారికకు కులపతి నాట్యాచార్య ఘంటాకనకారావు స్మారక 3నర్తనబాల అవార్డు2ను అందుకుంది. కాగా అభినయ నృత్యభారతి ఏలూరు వారిచే నిర్వహించిన సిద్దేంద్రయోగి జాతీయ స్థాయి బాలల నృత్యోత్సవాల్లో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి నిహారిక నర్తనబాల అవార్డు అందుకుంది. మూడవ తరగతి చదువుతున్న నిహారికను తల్లిదండ్రులు మురళి, లక్ష్మీసృజన, అలాగే భాష్యం పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, నాట్యశిక్షకురాలు స్పందనకుమారి, సరోజలు నిహారికను అభినందించారు. అలాగే తమ అకాడమిలో శిక్షణ పొంది అవార్డును అందుకోవడం తమకెంతో గర్వంగా ఉందని అకాడమి ప్రధానకార్యదర్శి మాడా బ్రహ్మం, అధ్యక్షుడు, మలిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డిలు హర్షం తెలియజేశారు. కాగా ప్రముఖ కూచిపూడి నృత్యాచార్యులు డా.వేదాంతం రాధేశ్యామ్, నాట్యాచార్యులు హేమసుందరం నిహారికకు అవార్డు అందించారు.