కడప

డంపింగ్‌యార్డు ప్రారంభించిన కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంబేపల్లె, జూలై 19: మండల కేంద్రంలోని డంపింగ్‌యార్డును మంగళవారం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 21 డంపింగ్‌యార్డులను మంజూరు చేయగా వాటిలో 9 పూర్తయినట్లు ఆయన తెలిపారు. ఒక్కొక్క డంపింగ్‌యార్డు రూ.4.50 లక్షలు మంజూరు చేశారన్నారు. ప్రతి మండలంలో డంపింగ్‌యార్డు తప్పనిసరిగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. చెత్త నుండి సంపద పొందాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న చెత్తాచెదారాలను ఇక్కడికి తెచ్చి యార్డులో పోయాలన్నారు. ఈ ప్రాంతపు రైతులకు వాణిజ్యపరంగా వివిధ పంటలపై హార్టికల్చర్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే ప్రతి కుటుంబంలో ఐదు మొక్కలు నాటితే వాటికి రూ.3 వేల నగదు చెల్లించనున్నట్లు, అదే విధంగా ఒక రైతు 400 మొక్కలు నాటి ఐదు సంవత్సరాలు పెంచితే రూ.5 లక్షలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. అలాగే గ్రామీణ రోడ్లకు ఇరువైపులా ఒక కిలోమీటర్ మేర చెట్లు నాటి 3 సంవత్సరాలు వాటిని పెంచితే రూ.3 లక్షలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఉపాధి హామీ కింద రైతుల పొలాల్లో, కొండ వాగుల్లో ఇంకుడుగుంతలు నిర్మించి భూగర్భజలాలు పెంపొందించేందుకు ప్రభుత్వం లబ్ది చేకూర్చే ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. అనంతరం రైతుల నుంచి వివిధ రకాల అర్జీలను కలెక్టర్ తీసుకున్నారు. అనంతరం పలు ప్రదేశాల్లో వివిధ రకాల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి, ఆర్డీవో చినరాముడు, జడ్పీటీసీ మల్లు నరసారెడ్డి, సర్పంచ్ నాగేశ్వర్‌నాయుడు, తహసిల్దార్ చంద్రమ్మ, ఎంపీడీవో రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా మండలంలో ప్రఖ్యాతిగాంచిన శ్రీ దేవరరాయి నల్లగంగమ్మ తల్లి ఆలయంలో కలెక్టర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో కలెక్టర్‌కు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారి విశిష్టతను తెలియజేశారు.