కడప

కన్నుల వైభవంగా శ్రీ సౌమ్యనాథుని కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందలూరు, జూలై 19:జిల్లాలోనే అతి ప్రాచీన, పురాతనమైందిగా ప్రసిద్ధికెక్కిన నందలూరు శ్రీ సౌమ్యనాథ ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన మంగళవారం జగత్ కల్యాణ చక్రవర్తియైన శ్రీ సౌమ్యనాథస్వామికి శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తుల కన్నుల విందుగా, చూచు వారికి చూడ ముచ్చటగా అంగ రంగ వైభవంగా కల్యాణ మహోత్సవం జరిగింది. తెల్లవారు జామునే సౌమ్యనాథునికి తిరుమంజనం కావించి అచ్చం పెళ్లికుమారుడులా అలంకరించారు. కళ్లు చెదిరే సౌందర్యవంతునిగా పట్టుబట్టలతో వెలుగులు చిందే అభరణాలతో అనంత కోటి సూర్యప్రభ తేజోమూర్తిగా భక్తజన కోటికి శ్రీవారు దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి ఉత్సవమూర్తులకు తిరుమంజనం అయిన తర్వాత పెళ్లికుమార్తెలుగా అలంకరించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా దైదీప్యమానంగా ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై సతీ, సమేతంగా స్వామివారిని వేదికపై కూర్చుండబెట్టారు. ప్రభుత్వం తరపున విప్ మేడా మల్లికార్జునరెడ్డి ముత్యాల తలంబ్రాలను తలపై పోస్తుండగా ఆలయ సాంప్రదాయ ప్రకారం మేళతాళాలతో ఆయనకు స్వాగతం పలికారు. ఈ తలంబ్రాలను అన్నదాన సేవా ట్రస్టు యెద్దల సుబ్బరాయుడుకు, ఆలయ ఇఓ సుబ్బారెడ్డికి అందజేశారు. కల్యాణోత్సవానికి శాసనమండలి వైస్ చైర్మన్ సతీష్‌రెడ్డి విచ్చేయడంతో విప్ మేడాతో పాటు ఆలయ నిర్వాహకులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించి కల్యాణోత్సవంలో ప్రత్యేక సంకల్ఫం నిర్వహించి కల్యాణాన్ని తిలకించారు. మాజీ మంత్రి సి.రామచంద్రయ్య దంపతులు కల్యాణోత్సవానికి విచ్చేసి స్వామివారిని దర్శించారు. దంపతులను ఆలయ నిర్వాహకులు పల్లె సుబ్రమణ్యం, గంటా వాసుదేవయ్యలు సత్కరించారు. రాజంపేట ఆర్డీఓ ప్రభాకర్‌పిళ్లై, డిఎస్పీ రాజేంద్ర, భక్తులకు అన్నదానం నిర్వహించిన సోమలరాజు చంద్రశేఖర్‌రాజులను నిర్వాహకులు సత్కరించారు. కల్యాణోత్సవంలో స్వామివారి కల్యాణ విశిష్టతను వాఖ్యాత సొట్టు సాంబశివమూర్తి వివరించారు. ఆగమ శాస్త్ర పండితులు పవన్‌కుమార్, అఖిల దీక్షితుల బృందం స్వామివారి కల్యాణోత్సవాన్ని వేద మంత్రాలతో ముఖ్యమైన మంగళసూత్ర ధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయం మార్మోగింది. ఈ కల్యాణోత్సవాన్ని తిలకించిన వారికి అత్యంత పుణ్యఫలం దక్కుతుందనే భక్తుల నమ్మకం. కల్యాణోత్సవం అనంతరం దేవేర్లతో స్వామివారిని పురవీధులలో ఊరేగించారు. ఉదయం నుండి జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన వేలాది మంది భక్తులతో ఆలయ కిటకిటలాడింది. ముందు జాగ్రత్త చర్యగా పోలీస్, ఆలయ నిర్వాహకులు భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలుగకుండా లఘ దర్శనం కల్పించారు. వేలాది మంది భక్తులకు టిడిపి సీనియర్ నాయకులు సోమలరాజు చంద్రశేఖర్‌రాజు అన్నదానం నిర్వహించారు. రాజంపేట డిఎస్పీ రాజేంద్ర, ఒంటిమిట్ట సిఐ శ్రీరాములు, రాజంపేట సిఐ మోహన్‌కృష్ణ, ఎస్సై భక్తవత్సలం గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించారు. కల్యాణోత్సవానికి ఆనవాయితీ ప్రకారం కొండపల్లె సుబ్బరాయుడు ఇంటి నుండి అమ్మవార్ల తాళిని మేళతాళాలతో తీసుకొచ్చారు. పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా, మండల అధికారులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. గత ఏడాది కంటే ఈ మారు అధిక సంఖ్యలో భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.
గజ వాహనంపై ఊరేగిన శ్రీ సౌమ్యనాథుడు
బ్రహ్మోత్సవాలలో అత్యంత ముఖ్యమైన కల్యాణ ఘట్టం పూర్తికావడంతో రాత్రి దేవతా చక్రవర్తియైన సౌమ్యనాథుడు ఒక్కరే గజ వాహనంపై గ్రామోత్సవానికి బయలుదేరారు.
నేడు రథోత్సవం
బ్రహ్మోత్సవాలలో భాగంగా 9వ రోజైన బుధవారం అత్యంత కోలాహలంగా సాగేదే రథోత్సవం. ఈ రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి రథాన్ని లాగి తమ మొక్కులు తీర్చుకుంటారు. రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలలో భాగంగా ఆర్కెస్ట్రా సినీ పాటలు భక్తులను ఆకట్టుకుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా కమిటీ సభ్యులు గంటా వాసుదేవయ్య, చక్రాల రామసుబ్బన్న, కె.వెంకటయ్య, సుబ్బరామయ్య, సుభాషిణి భక్తులకు సౌకర్యాలు కల్పించారు. ఆలయ ఆవరణలో పిహెచ్‌సి డాక్టర్ షామీరాభాను వైద్యసేవలు అందించారు. స్వర్ణాంధ్ర సంస్థ, ఏఐటిఎస్ విద్యార్థులు, టిఎన్‌ఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘం భక్తులకు సేవలు అందించారు.