కడప

డ్వాక్రా మహిళలకు మొక్కలు పెంచే బాధ్యతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 19: రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కల పెంపకం కార్యక్రమాన్ని డ్వాక్రా మహిళలకు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. హరిత విప్లవం తీసుకురావడానికి జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలకు దాదాపు 4లక్షలు మొక్కలు పంపిణీ చేయనున్నారు. డిఆర్‌డిఏ, డ్వామా, మెప్మా, వెలుగు ప్రాజెక్టుల పర్యవేక్షణలో జియోట్యాగ్ పర్యవేక్షణ ద్వారా ఇంటింటా మొక్కలు పంపిణీ చేయనున్నారు. ఈనేపధ్యంలో ప్రతి ఇంటి ముందు ఖాళీ స్థలాల్లో ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో, ప్రభుత్వ స్థలాల్లో జియో ట్యాగింగ్ ద్వారా మొక్కలు పంపిణీకి చర్యలు తీసుకున్నారు. ప్రతి మొక్కను బ్రతికించేందుకు డ్వాక్రా మహిళలకైతే సాధ్యవౌతుందని భావిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిఆర్‌డిఏ ,వెలుగు, ఇతర సిబ్బంది అధికంగా ఉండటంతో వారిని పర్యవేక్షించనున్నారు. ఈనేపధ్యంలో వెలుగు అధికారులు, సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. మెప్మా, డిఆర్‌డిఏ, వెలుగుశాఖల్లో చాలా మంది అధికారులు, సిబ్బంది పనిలేని కారణంగా ఈ బాధ్యతలను వారికి అప్పచెప్పనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పల్స్ సర్వేను కూడా వారికే బాధ్యతలు అప్పగించారు. డ్వాక్రా మహిళలు, పొదుపు ఈకార్యక్రమాన్ని ఉద్యమం తరహాలో చేపట్టి పెద్ద ఎత్తున పొదుపుచేయడంతోపాటు పలువురు ఆర్థికంగా తమ కాళ్లనిలబడటంతోపాటు ప్రభుత్వ సంక్షేమపథకాల అమలుకు డ్వాక్రా మహిళలను భాగస్వాములు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. జియోట్యాగ్ పద్దతిలో దాదాపు లక్ష మంది మహిళలకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొక్కలు పెంపకం బాధ్యతలు అప్పచెప్పినట్లు తెలుస్తోంది. ఏదేమైనా హరిత విప్లవం కూడా మహిళల నుంచే శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు.