కడప

ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కల్చరల్)జూలై 19: స్వస్తిశ్రీ ధుర్ముఖినామ సంవత్సరం ఆషాఢ శుద్ధిపూర్ణిమ (ఆషాఢవ్యాస పౌర్ణమి) పురస్కరించుకుని జిల్లాలో మంగళవారం శ్రీ సద్గురు సాయినాథునికి ఘనంగా పౌర్ణమి వేడుకలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రధానంగా నగరంలోని శ్రీ షిర్డిసాయిబాబా ఆలయాలతోపాటు కడప నగరంలోని మున్సిపల్ మైదానంలో వెలసివున్న శ్రీ దత్తసాయి మందిరం, శ్రీషిర్డిసాయిబాబా ఆలయం, కో-ఆపరేటివ్ కాలనీలోని సాయిబాబా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సాయినాథునికి ఉదయం 4గంటలకు కాగడ హారతి, 4.30గంటలకు అభిషేకం, ప్రత్యేక అలంకరణ, అర్చన, తీర్థప్రసాదాలు, మంగళహారతి ఇచ్చారు. అలాగే ఉదయం 9గంటలకు సాయి సత్యవ్రతం, 12గంటలకు కాగడ హారతి, సాయంత్రం 6గంటలకు సాయినాథునికి సంధ్యాహారతి, 8గంటలకు పల్లకీసేవ, 9గంటలకు పవళింపుసేవ తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం సాయినాధుని ఉత్సవ విగ్రహాలతో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. అలాగే కడపలోని గడ్డిబజారువీధిలోని శ్రీలక్ష్మీసత్యనారాయణస్వామి ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా నగరంలోని రాయచోటి రోడ్డులోని ప్రకృతినగర్, ఊటుకూరు లో వెలసివున్న శ్రీషిర్డిసాయిబాబా మందిరాలు, రైల్వేస్టేషన్ రోడ్డులోని సాయిబాబా మందిరం, అంగడివీధిలోని సాయిబాబా ఆలయం, అల్మాస్‌పేటలోని సాయిబాబా ఆలయం, నబీకోటలోని సాయిబాబా ఆలయం, ఐటిఐ సర్కిల్‌సమీపంలోని సాయిబాబా ఆలయంతోపాటు పలు ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం సాయినాథుని గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా నగరంలోని మృత్యుంజయకుంటలో ఏపి ఓబిసి హిందు దేవస్థాన 101,108 గుడి నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శాలివాహన సంఘం రాష్టన్రాయకుడు జికె మునెయ్య ఆధ్వర్యంలో ఉదయం శ్రీషిర్డిసాయిబాబా చిత్రపటాలకు పూలమాలలువేసి భక్తిశ్రద్ధలతో దత్తాత్రేయ గురువుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులచేత భజనలు, భక్తిగీతాలు ఆలపించారు. అలాగే గురువులుగా భావించి కృష్ణస్వామి దంపతులకు ప్రత్యేక కండువాతో సత్కరించారు. చేయించారు. ఈ కార్యక్రమంలో శివజ్యోతి శర్మ, కృష్ణస్వామి, లక్ష్మీదేవి, గురుశేఖర్, లావణ్య, వెంకటసుబ్బమ్మ పాల్గొన్నారు.