కడప

నియోజకవర్గాల వారీగా బిజెపి బలోపేతానికి శ్రీకారం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 19: బిజెపి జిల్లాలో బలమైన శక్తిగా ఎదిగేందుకు ఆపార్టీ అధిష్ఠానం జిల్లాపై ప్రత్యేక దృష్టిసారించి రాష్ట్ర,జిల్లా అధ్యక్షులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి 2019 ఎన్నికల నాటికి నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను పార్టీ నుంచి బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు సీమ జిల్లాల్లోని ముఖ్యనేతలంతా కడపను కేంద్రీకృతం చేసుకుని గత కొన్నిరోజులుగా సంప్రదింపులు చేస్తున్నారు. అంతేగాకుండా వచ్చేనెలలో సీమ జిల్లాల వ్యాప్తంగా కడపలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను రప్పించి భారీ బహిరంగసభను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అమిత్‌షా కూడా కడప బహిరంగ సభకు వస్తున్నట్లు ప్రకటించారు. కాగా తేదీ ఖరారు చేయాల్సివుంది. కొన్ని నెలలుగా మిత్రపక్షాలైన తెలుగుదేశం, బిజెపిల నేతలు అంటీ అంటనట్లుగా వ్యవహరిస్తున్నారు. బిజెపి కేడర్‌లో కూడా రెండు గ్రూపులుగా ఏర్పడి పైకి బాగా కన్పిస్తున్నా లోలోపల సరిపోవడంలేదని తెలుస్తోంది. జిల్లాలో కేడర్ అంతంత మాత్రంగానే ఉండగా పదవులకోసం నేతలు ఆధిపత్యపోరు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికలనాటికి ఒక వేళ పొత్తు ఉంటే రాజంపేట, రాయచోటి, ప్రొద్దుటూరులతోపాటు మరో నియోజకవర్గాన్ని బిజెపి అభ్యర్థులను బరిలో దించేందుకు అపార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తులేని పక్షంలో ఈ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలో దించేందుకు చర్చలు కొనసాగిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లు ఏడాది ముందే ఖరారుచేసి ప్రచారానికి దించనున్నారు. రాష్ట్రంలోని సీనియర్ నేతలు దగ్గుబాటి పురంధేశ్వరి, మాజీ మంత్రి కన్నాలక్ష్మినారాయణ, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్‌భూపాల్‌రెడ్డి, కె.శాంతారెడ్డి తదితరులతోపాటు రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు తరచూ జిల్లా లో పర్యటనలు చేసి కేడర్‌ను బలోపేతం చేసేందుకు బాధ్యతలు తీసుకోనున్నారు. నియోజకవర్గాల్లో సామాజికవర్గాల వారీగా నేతలను ఎంపికచేసి వారందర్నీ ప్రచార బరిలో దించి కులాలవారీగా ఓట్లను ఆకట్టుకోవడానికి కూడా బిజెపి అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సీమ జిల్లాల్లోని కడప జిల్లాపై బిజెపి పట్టుసాధించేందుకు సర్వశక్తులు వడ్డేందుకు విశ్వప్రయత్నాలు చేయనున్నట్లు తెలిసింది.