కడప

రాజంపేట వాణిజ్య పన్నుల శాఖలో అదనపు పన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, ఆగస్టు 4:రాజంపేట ప్రభుత్వ శాఖల్లో అవినీతి రోజురోజుకు పెరుగుతూ పోతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారు. ఈ శాఖ ఆ శాఖ అన్నది లేకుండా అన్ని ప్రభుత్వశాఖల్లో అవినీతి రాజ్యమేలుతున్నది. దీంతో సామాన్యులు పరిస్థితి దారుణంగా తయారవుతోంది. ఇక్కడి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతిపై దృష్టి పెడితే తప్ప అవినీతి తగ్గుముఖం పట్టే పరిస్థితులు కానరావడం లేదు. రాజంపేట వాణిజ్య పన్నులశాఖలో ప్రతి పనికీ అదనపుపన్ను చెల్లించాల్సిన దుస్థితిని ఇక్కడి వ్యాపారస్తులు ఎదుర్కొంటున్నారు. రాజంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నట్టే వాణిజ్య పన్నుల శాఖలో కూడా ప్రతి పనికీ ఒక రేటు ఉంది. అవినీతి నుండి కాపాడేందుకు ఉన్నతాధికారుల అండ ఉన్నట్టు ఆరోపణలున్నాయి. ఈ శాఖలో అవినీతి అధికారులు విశృంఖలంగా వ్యాపారస్తుల రక్తాన్ని జలగల్లాపట్టి పీలుస్తుండడం శోచనీయం. ఈ శాఖలో నిజాయితీ అధికారులు లేరా అంటే నిజాయితీ అధికారులున్నా వీరిశాతం చాలా తక్కువగా ఉంది. అవినీతి విషయంలో వాణిజ్య పన్నుల శాఖాధికారులదే తప్పని చెప్పలేము. ఎందుకంటే ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యాపారాలు చేస్తున్న వ్యాపారస్తుల శాతమూ తక్కువగా ఉంది. దీంతో తాము వినియోగదారులకు చేస్తున్న మోసాల నుండి బయటపడేందుకు వాణిజ్యపన్నుల శాఖలో అవినీతిని పెంచి పోషించేందుకు తోడ్పతున్నారు. దీంతో నిబంధనల మేరకు నిజాయితీతో వ్యాపారాలు చేసే వారితో పాటు ఇప్పడిప్పుడే వ్యాపారాలు చేయాలనుకునే వ్యాపారస్తులు ఈ శాఖ అవినీతికి బలవ్వక తప్పడం లేదు. వ్యాపారం చేయదలచినవారు నిబంధనల మేరకు ముందుగా ఈ శాఖలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకుగాను వ్యాపార స్వభావాన్ని బట్టి సుమారు రూ.3వేల నుండి రూ.5వేల వరకు అదనంగా సమర్పించుకోవాల్సిన పరిస్థితులున్నట్టు సమాచారం. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సదుపాయం ఉన్నా ఈ మార్గంలో దరఖాస్తుచేసిన వారికి ఇంటి నంబర్ సరిపోవడం లేదనో, దరఖాస్తు చేసిన వ్యాపారానికి ఆ స్థలం అనువుగా ఉండదనో ఇత్యాది కుంటి సాకులుచెప్పి దరఖాస్తుదారున్ని తమ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటుండడం కద్దు. అవినీతి కప్పం కట్టేవరకు దరఖాస్తుదారుకు రిజిస్ట్రేషన్ దక్కదంటే అతిశయోక్తి కాదు. ఇకపోతే రాజంపేట వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల్లో ఫెవికాల్ వీరులు కూడా ఉన్నారు. వీళ్లు ఏళ్ల తరబడి ఇదే కార్యాలయంలో పనిచేస్తుండడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ పొందిన వ్యాపారి వద్దకు అడ్వైజరీ విజిట్ పేరుతో అధికారులను తీసుకెళ్ళి తమ డాబు దర్పం చూపుతున్నట్టు ఆరోపణలున్నాయి. కొన్ని సందర్భాల్లో వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో పనిచేసే కొంతమంది ఉద్యోగులు ముఖ్యమైన హోటల్స్‌లో సుష్టుగా భోంచేస్తూ బిల్లులు కూడా చెల్లించని సందర్భాలున్నాయి. దీంతో వ్యాపారస్తులు లబోడిబోమనడమే తప్ప వీరిని ఏమీ అనలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అంతేకాక ఈ శాఖ ఉద్యోగులు కొందరు నెలనెలా డాఖలు చేయాల్సిన రిటర్న్‌లను తామే దాఖలు చేస్తామని అలా చేస్తే తక్కువ ట్యాక్స్ కట్టవచ్చని వ్యాపారస్తులను ప్రలోభపెట్టి తమ దారికి మళ్లించుకుంటున్నట్టు తెలుస్తొంది. తమలో లోపాల కారణంగా కొంతమంది వ్యాపారస్తులు కూడా వీరి ప్రలోభాలను తలొగ్గక తప్పడం లేదు. ఈ శాఖలో పనిచేసే అవినీతి ఉద్యోగుల మాట వినని వారికి వే బిల్లులు బ్లాక్ చేయడం, ఆడిట్లు వేసుకోవడం, ఒక్కింట పన్నుకు మూడింటల అపరాధ రుసుము లాగడం సర్వసాధారణంగా మారుతున్నట్టు పలువురు వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. ఈ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు తమ పబ్బం గడుపుకోవడానికి రాష్టస్థ్రాయి నాయకులు, ప్రతిపక్ష నాయకుల పేర్లను ఉపయోగించుకోవడానికి కూడా వెనుకాడని పరిస్థితులున్నాయి. ఈ శాఖలో ఓ స్థాయి ఉద్యోగులు ఎవ్వరూ బస్సులలో ప్రయాణించరు. స్థాయిని బట్టి కార్లు మారుతూ ఉంటాయి. ఈ శాఖ తన అవినీతి రాజ్యాన్ని విస్తరించుకునేందుకే పప్పు్ధ్యన్యాల నుండి ప్లాస్టిక్ వస్తువుల వరకు దేన్నీ వదలని పరిస్థితులున్నాయి. ఈ శాఖ ఉన్నతోద్యోగి ఒకరు రాజంపేటలో ఉండరు. తీరిగ్గా మధ్యాహ్నానికి కార్యాలయానికి రావడం షరామామూలు తంతుగా ఉంది. అప్పటి వరకు ఒక కాగితం కూడా కదలదని తెలుస్తొంది. ఈ ఉన్నతోద్యోగి పరిశీలన తరువాత మాత్రమే కార్యాలయంలో దరఖాస్తుల పరిశీలన మొదలవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక లారీ చెక్‌ల ఏరుతో ఈ శాఖ ఉద్యోగులు చాలామంది రోడ్లపైపడి దోచుకోవడం సర్వసాధారమై పోతుంది. ఏ చిన్న పొరపాటు ఉన్నా వేలల్లో లారీల నిర్వాహకుల నుండి కక్కించడంలో అందెవేసిన చేతులుగా పలువురు ఉద్యోగులకు పేరుంది. అవినీతి ఉద్యోగుల అవినీతి డిమాండ్‌ను ఒప్పుకోకుంటే పలు కారణాలతో లారీలను ఆపేస్తారు. లారీ అద్దెలకు భయపడి దుకాణాదారులు ఈ శాఖ అవినీతి ఉద్యోగులు కోరిన అవినీతి మొత్తాన్ని సమర్పించుకొని బయటపడడం జరుగుతూ వస్తుంది. రాజంపేట వాణిజ్య పన్నుల శాఖలో గత కొనే్నళ్లుగా జరిగిన పనులు, ఈ శాఖలో పనిచేసే ఉద్యోగుల ఆస్తిపాస్తులు, హంగామా, దర్పం వంటి విషయాలపై సమగ్ర విచారణ జరిపితే మొత్తం అవినీతి వ్యవహారం బట్టబయలవుతుంది. వ్యాపారులు కూడా తాము లంచాల మార్గంలో ఇచ్చే రొఖ్ఖం ట్యాక్స్ రూపంలో చెల్లిస్తే వీరి లంచాల కంటే ట్యాక్స్‌లకు పెద్ద తేడా ఉండకపోగా, ఈ శాఖ ఉద్యోగులకు నిత్యం భయపడే పరిస్థితులు తప్పుతాయి. అలాగే ఆడిట్లు విషయంలోను ఏ అంశంపైన విచారించదలచుకున్నారో ముందే చెప్పే విధంగా చట్టాలను సవరిస్తే చాలా వరకు ఈశాఖలో అవినీతిని తగ్గించేందుకు వీలవుతుందని తెలుస్తుంది. ఇప్పటికైనా రాజంపేటే వాణిజ్యశాఖలో జరుగుతున్న అవినీతిని రూపుమాపేందుకు ఉన్నతస్థాయి విచారణ జరపాల్సిన అవసరముంది. ఈ శాఖలో అవినీతి రూపుమాపితే ప్రభుత్వానికి కూడా ఆదాయం భారీగా చేకూరుతుందనడంలో సందేహం లేదు.