కడప

రాష్ట్రానికే తలమాణికంగా గండి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్రాయపేట, ఆగస్టు 4: రాయలసీమలో పేరు, ప్రఖ్యాతులు కలిగిన గండి క్షేత్రంలో రాష్ట్రంలో తలమాణికంగా అభివృద్ధి చేస్తామని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం గండిక్షేత్రంలో నూతన పాలకమండలి సమావేశం దేవాదాయ సహయ కమిషనర్ పట్టెం గురుప్రసాద్, ప్రధాన అర్చకులు కేసరి స్వామి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి సతీష్‌కుమార్‌రెడ్డితోపాటు పౌర సరఫరాల రాష్ట్ర చైర్మన్ లింగారెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గండిక్షేత్రం గతంలో టిటిడి ఆధ్వర్యంలో ఉండేదన్నారు. ఈ క్షేత్రంలో లక్షలాది రూపాయల ఆదాయం వచ్చినా అభివృద్ధి అంతంత మాత్రమే ఉందన్నారు. గండి క్షేత్రంపై ప్రత్యేక దృష్టిపెట్టి టిటిడి నుండి దేవాదాయశాఖలోకి గత ఏడాది అక్టోబర్ 3వ తేది విలీనం చేశామన్నారు. గత 9 నెలలుగా దాదాపు తలనీలాల ద్వారా రూ. 60 లక్షలు, భక్తుల కొబ్బరికాయల ద్వారా రూ. 30 లక్షలు, కొబ్బరి చిప్పల ద్వారా రూ. 6 లక్షలు దాదాపు కోటి రూపాయల ఆదాయం వచ్చిందన్నారు.క్షేత్రాన్ని దాతల సహకారంతో భక్తులకు శాశ్విత షెడ్‌లు, క్యూ లైన్, దేవస్థానంలో బండ పరుపు పనులు చేయించినట్లు తెలిపారు. నూతన పాలక మండలి కొరకు పలువురు చైర్మన్ పదవికోసం ఆశించిన గండిక్షేత్రం ఎవరి ద్వారా అభివృద్ధి సాధిస్తుందని దృష్టిలో పెట్టుకుని ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన వడ్లకుంట
రాజారావును చైర్మన్‌గా, పట్టెం వెంకటసుబ్బమ్మ, కళ్లూరి వెంకటస్వామి, అనిమల సుబ్బరాయుడు, బైరెడ్డి అంజన్‌రెడ్డి, పబ్బులేటి బాబు, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, కుళాయప్ప, భాస్కర్‌లను స భ్యులుగా నియమించామన్నారు. బిజె పి జిల్లా అధ్యక్షులు శ్రీనాధ్‌రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు శశిభూషణ్‌రెడ్డి, రాష్ట్ర హర్టికల్చర్ డైరెక్టర్ కర్నాటి నాగభూషణ్‌రెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు ఈశ్వరరెడ్డి, సొసైటీ డైరెక్టర్ హరినాధరెడ్డి, అధ్యక్షులు అశోక్‌కుమార్, మాజీ సర్పంచ్ సుబ్బరామయ్య, మాధవరెడ్డి, వెంకటేశ్వర్లునాయుడు, చిదంబరంరెడ్డి, గంగిరెడ్డి, వేంపల్లె ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు.