కడప

రైలుకింద పడి యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైల్వేకోడూరు, ఆగస్టు 4 : మండలంలోని బాలుపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం గుర్తుతెలియని యువకుడు రైలుకిందపడి మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ముంబాయి నుంచి చెన్నై వెళ్లే రైలు నుంచి కిందపడి మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ సమాచారంపై రేణిగుంట రైల్వే పోలీసులకు ఫోన్ చేయగా వారు సమాధానం ఇవ్వలేదు.
అనుమానాస్పదంగా మహిళ మృతి
పెండ్లిమర్రి, ఆగస్టు 4:మండల పరిధిలోని పాతసంగటిపల్లె గ్రామపంచాయతీ హరిజనవాడలో నివసిస్తున్న సి.చంద్రకళ (32) అనే మహిళ ఉరివేసుకుని మృతి చెందినట్లు ఎస్‌ఐ రోషన్ తెలిపారు. బుధవారం రాత్రి ఇంట్లోని ఫ్యానుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు భర్తకొండయ్య, బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదుచేశామన్నారు. గత కొన్నినెలలుగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఈమెకు ముగ్గురు పిల్లలున్నారని తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే 108వాహనంలో రిమ్స్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహించి అనంతరం బంధువులకు మృతదేహాన్ని అప్పగించామన్నారు.
రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత మృతి
గాలివీడు, ఆగస్టు 4:మం డలంలోని ప్యారంపల్లె గ్రా మ పంచాయతీకి చెందిన తె లుగుదేశం పార్టీ నేత పెద్దిరెడ్డి నారాయణరెడ్డి(41) రో డ్డు ప్రమాదంలో బుధవారం రాత్రి 11 గంటలకు మృతిచెందారు. సర్పంచ్ బయ మ్మ కథనం మేరకు నారాయణరెడ్డి స్వగ్రామమైన కరణంవారి కొత్తపల్లెకు వెళ్లి ఎన్‌ఆర్‌ఐ నాగభూషణరెడ్డితో కలి సి రాత్రి 9 గంటల ప్రాంతంలో గాలివీడుకు మోరుబైకులో బయలుదేరారు. రెడ్డివారిపల్లెకు పడమరదిశన ఉన్న మిట్ట వద్ద బైక్ అదుపు తప్పి సైడు కాలువలోని బండరాళ్లపై పడ్డాడు. రాత్రి 10 గంటల సమయంపై బడుతున్నా భర్త ఇంటికి రాకపోవడంతో నారాయణరెడ్డి భార్య కరణంవారి కొత్తపల్లెకు ఫోన్ చేయడంతో అందరూ అప్రమత్తమై గాలించగా రోడ్డు పక్క 10 అడుగుల లోతులో నారాయణరెడ్డి విగత జీవుడై పడి ఉండటం గమనించి వెంటనే రాయచోటి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. వృత్తిరీత్యా ఎరువుల దుకాణం నిర్వహిస్తూ జన్మభూమి కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తూ మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉండేవారు. ఇతనికి వృద్ధులైన తల్లిదండ్రులు, భార్య, ఇరువురు కుమారులు ఉన్నారు. కాగా ఎరువుల దుకాణాల యజమాని నారాయణరెడ్డి మృతికి సంతాప సూచికంగా మండల కేంద్రంలో ఎరువుల దుకాణాలను గురువారం మూసివేసినట్లు ఆగ్రోస్ సూర్యనారాయణరెడ్డి తెలిపారు. నారాయణరెడ్డి మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి రాజగోపాల్‌రెడ్డి సతీమణి హేమలతమ్మ, లక్కిరెడ్డిపల్లె వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ప్రభాకర్‌బాబు, వ్యవసాయాధికారి రామాంజనేయాచారి, ఎంపీపీ చిన్నరెడ్డి, జడ్పీటీసీ లక్ష్మిదేవి, మాజీ ఎంపీపీలు వెంకటరమణరెడ్డి, వెంకటనారాయణరెడ్డి, మండల వైకాపా నాయకులు యదుభూషణరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు వేదమూర్తిరెడ్డి, బుల్లెట్ వెంకటరమణారెడ్డి, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
నిప్పంటించుకుని బాలిక ఆత్మహత్య
కమలాపురం, ఆగస్టు 4: స్థానిక రాంనగర్‌కాలనీకి చెందిన దివ్యస్నేహ (13) ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం దివ్యస్నేహ పాఠశాలకు మూడురోజులుగా వెళ్లలేదన్న ఆగ్రహంతో తల్లి మందిలించడం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ఆ బాలిక ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. బాధను భరించలేక కేకలు వేయడంతో సమీపంలోని ఇళ్లవారు ఇంట్లోకి వెళ్లి చూడడంతో సగానికి పైగాకాలిపోయిన శరీరంతో పడి ఉన్న ఆ బాలికను స్థానిక 108ద్వారా కడప రిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొంతసేపటికే ఆ బాలిక మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. స్థానిక ప్రవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న దివ్యస్నేహ వాళ్ల తల్లిదండ్రులకు వివాహం జరిగిన చాలా ఏళ్లకు పుట్టడంతో ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేసారు. చిన్న విషయానికే మనస్తాపంతో మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరై విలపించారు. ఈ బాలిక మృతితో రాంనగర్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. కడప ఔట్‌పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి స్థానిక పోలీసుస్టేషన్‌కు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
రాళ్ల వాహనాల సీజ్
కమలాపురం, ఆగస్టు 4: కడప-తాడిపత్రి హైవేరోడ్డుపై గురువారం యర్రగుంట్ల మైనింగ్ అదికారులు రాధ, సురేంద్రబాబు ఒక లారీని, 3 ట్రాక్టర్లను సీజ్ చేసారు. యర్రగుంట్లనుంచి కడప వైపు పర్మిట్లులేని రాళ్లలోడును తీసుకువెళుతున్నారన్న ఆరోపణపై వాటిని సీజ్ చేసిన స్థానిక పోలీసు స్టేషన్‌లో స్వాధీనం చేసారు. అనంతరం లారీకి రు.10వేలు, ట్రాక్టర్లకు రు.5వేలుచొప్పున అధికారులు జరిమానా విధించారు.
ఎర్రచందనం పట్టివేత
రైల్వేకోడూరు, ఆగస్టు 4:మండలంలోని మాధవరంపోడు సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న సుమారు రూ. 5 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను బుధవారం రాత్రి పట్టుకున్నట్లు ఎస్సై రమేష్‌బాబు గురువారం తెలిపారు. అందిన సమాచారంతో సిఐ రసూల్‌సాహెబ్ ఆధ్వర్యంలో రూరల్ ఎస్సై మంజునాధ్, సిబ్బందితో వాగేటికోన అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించగా 15 దుంగలు పొదల మాటున గుర్తించామన్నారు. సంఘటనా స్థలంలో ఎవరు లేక పోవడంతో బుధవారం రాత్రి నుండి గురువారం తెల్లవారు జాము వరకు అటవీ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించామన్నారు.