కడప

మీకోసంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కల్చరల్)ఆగస్టు 29: ఎన్నో సమస్యలపై జిల్లా నలుమూలల నుంచి పేదప్రజలు మీ కోసం కార్యక్రమానికి వచ్చి తమ సమస్యల పరిష్కారం కావాలని ఆశపడతారని అలాంటి వారి నమ్మకాన్ని వమ్ముచేయొద్దని జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ అధికారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో మీకోసం సభాభవన్‌లో ప్రజల వినతుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈకార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను సంబందిత అధికారులందరూ వెంటనే పరిశీలించి పరిష్కరించాలన్నారు. వినతులు పరిష్కరించిన వెంటనే సమాధానాలు ఆన్‌లైన్‌లో ఉంచాలన్నారు. చింతకొమ్మదినె్న మండలం మామిళ్లపల్లె గ్రామానికిచెందిన పి.సల్మాభాను తన భర్త గుండెపోటుతో మృతి చెందాడని, ముగ్గురు ఆడపిల్లలున్నారని జీవనాధారం లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం వితంతుపెన్షన్‌తోపాటు ఆపద్బంధు పథకం కింద ఆర్థికసహాయాన్ని అందించాలని కోరారు. కొండాపురం మండలం చౌటపల్లెకు చెందిన సుబ్బలక్షుమ్మ గండికోట మునక కింద తన పేరును ఎకనామిక్ సర్వేలో చేర్చాలని కోరారు. మైలవరం మండలానికి చెందిన సుధాకర్ బాబు తమ గ్రామంలో 52 ఎస్సీ కుటుంబాలు ఉన్నాయని, చర్చి నిర్మాణంకోసం స్థలాన్ని మంజూరు చేయాలని కోరారు. కడప ఇందిరానగర్‌కు చెందిన ఎస్.రజియా ఎన్‌ఎఫ్‌బిఎఫ్ పథకం కింద ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. నగరానికి చెందిన వెంకటరమణారెడ్డి ఎక్స్‌సర్వీస్‌మెన్ కోటా కింద తన ఆధీనంలో ఉన్న భూమిని పట్టాను మంజూరు చేయాలని కోరారు. వల్లూరు మండలం పైడికాలువ గ్రామానికి చెందిన డి.ప్రకాశం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తులను సంబంధిత అధికారులకు పంపుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జెసి శే్వతతెవతియ, డిఆర్‌ఓ సులోచన, డిపిఓ తిప్పేస్వామి, సాంఘిక సంక్షేమశాఖ డిడి సరస్వతి, డిఎంఅండ్‌హెచ్‌ఓ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.