కడప

బాలుడి దారుణ హత్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 13:కట్టెలు తెచ్చిన తంటాతో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణతో యానాల రమణయ్య కుమారుడు గణేష్ (13) అను బాలుడు హత్యకు గురయ్యాడు. అయితే ఈ సంఘటన ఆలశ్యంగా (ఐదురోజుల తర్వాత) వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బ్రహ్మంగారిమఠం మండలంలోని రవీంద్రనగర్ (వడ్డెవారిబావి) గ్రామానికి చెందిన యానాల రమణయ్య, యానాది రమణయ్యలు కలిసి చౌదరివారిపల్లె గ్రామ సమీపంలో బొగ్గుల వ్యాపారి వద్ద కట్టెలు కొట్టుకుంటూ, బొగ్గులు కాల్చి తద్వారా ఇద్దరూ జీవనం సాగిస్తుండేవారు. అయితే ఈనెల 9న బొగ్గుల కోసం కొట్టుకున్న కట్టెలలో ఎక్కువ కట్టెలు యానాల రమణయ్య కొట్టుకున్నాడని, అందులో పెద్దవి ఉన్నాయనే ఉద్దేశ్యంతో ఎస్సీ కాలనీకి చెందిన రమణయ్య అసూయచెంది ఘర్షణ దిగాడు. యానాల రమణయ్య కుమారుడైన గణేష్ శుక్రవారం ఉదయం బిమఠంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు వెళ్లి పాఠశాల ముగిసిన తర్వాత బస్సులో తన తల్లిదండ్రులు బొగ్గులు కాల్చే చోట బస్సు దిగి అక్కడ తన తల్లిదండ్రులు కనిపించకపోవడంతో సైకిల్‌పై ఇంటికి బయలుదేరాడు. ఘర్షణపడి కాపుకాచి వున్న ఎస్సీ కాలనీకి చెందిన రమణయ్యతోపాటు మరికొందరు అనుచరులు మద్యం సేవించి ఇంటికి సైకిల్‌పై వస్తున్న గణేష్‌ను చూసి అరవకుండా నోటిలో గుడ్డలు కుక్కి, రోడ్డుకు దూరంగా పొలాల్లోకి తీసుకెళ్లి అతి కిరాతకంగా బాలుడి కుడిచేతిని నరికివేసి, పొడిచి చంపారు. బాలుడికి చెందిన పుస్తకాల బ్యాగు, సైకిల్‌ను శవానికి కొద్ది దూరంలో పడవేసి అక్కడి నుంచి పారిపోయారు. తమ పిల్లవాడు ఇంకా ఇంటికి రాలేదని గమనించిన కుటుంబ సభ్యులందరూ కలిసి గత ఐదురోజులుగా తమ బంధువులు, స్నేహితులు, పరిసర ప్రాంతాల్లో వెతికారు. చివరకు మంగళవారం సాయంత్రం చౌదరివారిపల్లెకు చెందిన పొలం యజమానులు వర్షం పడడంతో వరినారు పోసేందుకై పొలానికి వెళ్లగా అక్కడ సైకిల్‌తోపాటు పుస్తకాలు కనిపించాయన్నారు. దుర్వాసన రావడంతో అక్కడికెళ్లి చూడగా బాలుడి శవముందని బాలుడి తల్లిదండ్రులతోపాటు పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. 9వ తేదీ మధ్యాహ్నం జరిగిన వడ్డెర, యానాది కులాలకు చెందిన రమణయ్య తండ్రిని ఏమీ చేయలేక తన కుమారుడిని చంపారని స్థానికులతోపాటు పోలీసులు పేర్కొంటున్నారు. హంతకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ :యానాల గణేష్ (13) అనే బాలుడిని హత్యచేసిన సంఘటనా స్థలాన్ని మంగళవారం సాయంత్రం మైదుకూరు డిఎస్పీ రామక్రిష్ణయాదవ్, రూరల్ సిఐ నాగభూషణం, ఎస్సై రంగస్వామిలు తమ సిబ్బందితో కలిసి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పక్కన పడవేసిన సైకిల్, పుస్తకాల బ్యాగును స్వాధీనం చేసుకొని, గుర్తుపట్టలేని స్థితిలో వుండి, దుర్వాసన వెదజల్లుతున్న మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లను రాసుకొని కేసు నమోదుచేసుకున్నారు.
మృతుని తల్లిదండ్రులు ఆరోపిస్తున్న ఐదుగురు వ్యక్తులు అందుబాటులో లేరని, వీలైనంత త్వరలో హంతకులను అదుపులోకి తీసుకొని విచారిస్తామని డిఎస్పీ పేర్కొన్నారు. గ్రామానికి చెందిన యానాల రమణయ్య కుమారుడు గణేష్ (13) అను బాలుడిని చంపారనే వార్త గ్రామంలో తెలియడంతో బాలుడితోపాటు తోటి విద్యార్థులు, గ్రామస్తులంతా శోకసంద్రంలో మునిగారు. తల్లిదండ్రులు బోరున విలపిస్తున్న దృశ్యాలను ప్రతి ఒక్కరికీ కంటతడి పెట్టించాయి. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామానికి వచ్చారు.