రాష్ట్రీయం

కెన్యా యువతి హైదరాబాద్‌లో అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐసిస్‌తో సంబంధాలున్నట్టు వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 12: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న ఓ యువతిని శనివారం ఇంటెలిజెన్స్, నిఘా విభాగం అధికారులు అరెస్టు చేశారు. టోలిచౌక్‌లో పట్టుబడ్డ ఆ యువతి కెన్యా దేశానికి చెందినదిగా స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీం (సిట్) అధికారులు గుర్తించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో మార్కెటింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న రియాజుద్దీన్‌ను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అమీనా ఐసిస్ సానుభూతిపరురాలని సిట్ పోలీసులు నిర్థారించారు. కర్నాటక గుల్బర్గాకు చెందిన రియాజుద్దీన్, జైపూర్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో పనిచేస్తూ ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా యువతీ, యువకులను ఐసిస్‌లో చేర్పించే యత్నం చేస్తున్నాడు. ఉగ్రవాద భావజాలంతో కూడిన వీడియో టేపులు, సాహిత్యాన్ని ఫేస్‌బుక్ ద్వారా అందిస్తున్నాడని కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు పసిగట్టాయి. రియాజుద్దీన్ ఇచ్చిన సమాచారంతో ఆమెను అరెస్టు చేసినట్టు తెలిసింది. అమీనా(20) ఓ బాయ్ ఫ్రెండ్‌తో రెండు నెలల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చినట్టు తెలిసింది. పోలీసుల అదుపులోవున్న అమీనాను కేంద్రప్రభుత్వ అనుమతితో తిరిగి శనివారం రాత్రి కెన్యాకు పంపించినట్టు తెలుస్తోంది. ఇరవై ఏళ్ల యువతి అమీనా తల్లిదండ్రులను పిలిపించి కౌనె్సలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సిట్ అధికారి ఒకరు తెలిపారు.