క్రైమ్/లీగల్

వ్యాను ఢీకొని నాలుగు గేదెలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు, మే 14: మండల పరిధిలోని సాయిరాం తండా వద్ద తల్లాడ, కొత్తగూడెం ప్రధాన రహదారిపై సోమవారం తెల్లవారు జామున వ్యాను ఢీకొనటంతో 4గు గేదెలు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం జూలూర్‌పాడ్ నుండి కొత్తగూడెం వైపు వెళుతున్న కోళ్ల వ్యాను రోడ్డుదాటుతున్న గేదేలను వేగంగా ఢీకొట్టటంతో నాలుగు గేదెలు మృతి చెందాయి. వెంగన్నపాలెం గ్రామానికి చెందిన సుబ్బారావు, ముత్తయ్య అనే రైతులకు చెందిన గేదెలుగా గుర్తించారు. వీటి విలువ సుమారు రెండు లక్షలు ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు.

హత్యకు కారణం అల్లుడే..!
ఏన్కూరు, మే 14: ఈనెల 9న మండల పరిధిలోని సూర్యాతండాలో బాదావత్ రామి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆమె హత్యకు కారణం అల్లుడు రవి అని పోలీసులు తెలిపారు. స్థానికి పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఎసిపి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఏన్కూరుకు చెందిన భూక్య రవికి, సూర్యతండాకు చెందిన బాదవత్ రామి కూతురైన శ్రావణికి 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో వారిరువురు మధ్య మనస్పర్థలు వచ్చి రెండు సంవత్సరాల క్రితం భార్య శ్రావణి పిల్లలను తీసుకొని తల్లి వద్దకు సూర్యాతండా వెళ్లింది. అక్కడే ఉంటూ భర్త రవిపై కోర్టులో కేసు వేసింది. రవి కొత్తగూడెంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. తన ఉద్యోగానికి ఇబ్బంది కలుగుతుందని నెపంతో భార్యను ఎలాగైన హతమార్చాలని కుట్ర పన్నాడు. ఈ క్రమంలో ఈనెల 8న పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామానికి చెందిన చొక్కారావు, సన్న అనే వ్యక్తులతో పన్నాంగం వేసుకొని భార్యను చంపితే లక్ష ఇస్తానని బేరమాడి ముగ్గురు కలిసి సూర్యాతండా వెళ్లారు. అక్కడ పగలంతా రెక్కి నిర్వహించి అర్థరాత్రి దాటిన తరువాత ఇంటి ముందు నిద్రిస్తున్న అత్త రామిని రవి భార్య శ్రావణి అనుకొని పదునైన కత్తితో పొడిచి చంపి పరారైనారు. దీంతో ఎట్టకేలకు నిందితులను పట్టుకొన్న పోలీసులు విచారించి అత్తహత్యకు కారణం అల్లుడేనని తేల్చారు. నిందితుల్ని ముగ్గురను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు.

అక్రమంగా తరలిస్తున్న రూ.80 వేల గుట్కాలు పట్టివేత
టేకులపల్లి, మే 14: టేకులపల్లిలో సిఐ దోమల రమేశ్ ఆద్వర్యంలో టేకులపల్లి ఎస్‌ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ పోలీసు సిబ్బందితో వాహనాల తనిఖీ సోమవారం నిర్వహించారు. తనిఖీలో భాగంగా ఇల్లందు నుండి కొత్తగూడెం వైపువెళ్లుతున్న ఆటోపై అనుమానం రావడంతో పోలీసులు తనిఖీ చేశారు. అందులో అక్రమంగా గుట్కా సంచులు ప్యాక్ చేసి ఉండటాన్ని గమనించి అదుపులోకి తీసుకున్నారు. సుమారు గుట్కాల విలువ రు.80 వేలు ఉంటుందని సి ఐ రమేశ్ తెలిపారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.