క్రైమ్/లీగల్

గాంధీభవన్ ముందు ఆత్మహత్యకు యత్నించిన కౌలు రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూసుమంచి, సెప్టెంబర్ 22: హైదరాబాద్‌లో గాంధీభవన్ ముందు ఆత్మహత్యకు యత్నించిన కౌలురైతు శనివారం మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే కూసుమంచి మండలంలోని భగవత్‌వీడు గ్రామానికి చెందిన దేవబత్తిని వెంకటేశ్వర్లు శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ గాంధీభవన్ ముందు పురుగులమందు సేవించి ఆత్మహత్య ప్రయత్నం చేయగా అక్కడ స్థానికులు అంబులెన్స్ ద్వారా ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ అతను చికిత్సపొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఆత్మహత్య ప్రయత్నం చేసిన సమయంలో అతను తానకు వ్యవసాయం భారం అయ్యి అప్పుల పాలవడంతో టిఆర్‌ఎస్ ప్రభుత్వం కౌలురైతుననే నెపంతోఎటువంటి సహాయం చేయలేదని అందుకే జీవితం వీద విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా తెలిపాడు. గ్రామస్తులు కుటుంబ సభ్యుల కధనం ప్రకారం 5ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాడని, అందుకోసం భారీగా అప్పుల పాలయ్యాడని, తనకు ఉన్న డిసిఎం వాహనం, ట్రాక్టర్‌లను అమ్మినా అప్పులు తీరకపోవడంతో హైదరాబాద్‌లో గాందీభవన్‌ముందు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. అక్కడ చనిపోతేనన్న రాష్టవ్య్రాప్తంగా తన సమస్య ద్వారానైన ప్రభుత్వానికి కనువిప్పి కలుగుతుందని భావించి అలా చేసి ఉంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎడిఎ వాణి, తహశీల్దార్ కృష్ణ ఆధ్వర్యంలో భగత్‌వీడుగ్రామానికి వెళ్ళిన అధికారుల బృందం విచారణ చేపట్టి పై ఆధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. శనివారం రాత్రికి మృతదేహం రానున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబం తరుపున ధర్నా నిర్వహించి మృతుడి కుటుంబానికి 20లక్షల ఎక్స్‌గ్రేషియా తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆంతేగాక మృతుడి కుటుంబానికి తమ పార్టీ తరుపున సహాయం చేస్తామని తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మండల నాయకులు రషీద్ ఆహ్మద్, మందపల్లి కొటేశ్వరరావు, వీరవెల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.