క్రైమ్/లీగల్

బెట్టింగ్‌కు పాల్పడుతున్న యువకుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రుపాలెం, మే 28: ఐపియల్ క్రికెట్ మ్యాచ్‌లలో బెట్టింగ్ పెట్టి ఆడుతున్న యువకులను ఎర్రుపాలెం ఎస్సై జె అంజనేయులు ఆదివారం రాత్రి దాడి చేసి పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఆదివారం రాత్రి జరిగిన చెనై- హైద్రాబాదు క్రికేట్ మ్యాచ్‌కి సంబందించి జమలాపురం గ్రామానికి చెందిన 22మంది ఎన్టీఆర్ విగ్రహం వద్ద క్రికెటు బెట్టింగ్ ఆడుతుండగా పట్టుకుని వారి వద్ద నుండి 7వేలు రూపాయలు, స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఎర్రుపాలెం రింగు సెంటర్‌లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 10మందిని ఆదివారం రాత్రి పట్టుకుని అరెస్టు చేసారు. వీరి వద్ద నుండి 2వేల రూపాయాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ యువత క్రీడలను అభిమానించి ఆశ్వాదించాలేకాని డబ్బులు పెట్టి బెట్టింగులు వేయకూడదన్నారు. బెట్టింగ్‌ల వలన కుటుంబాలు పలు ఇబ్బందులకు గురవుతాయన్నారు. యువత ఎటువంటి జూదం ఆటలను ఆడినా, వాటిని పోత్సహించినా ఉపేక్షించేది లేదన్నారు. ఎంతటి వారైన తప్పకుండ కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జాస్తిపల్లిలో వ్యక్తి దారుణ హత్య
కామేపల్లి, మే 28: భూ తగదాలు, పాత కక్షల కారణంగా వ్యక్తి దారుణంగా హత్యకు గురైన సంఘటన ఆదివారం అర్ధరాత్రి స్థానిక మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని జాస్తిపల్లి గ్రామానికి చెందిన చల్లా వెంకన్న (45) తన ఇంటి ఆవరణలో కుటుంబ సభ్యులతో నిద్రిస్తుండగా ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో కొందరు వ్యక్తులు కోట కత్తులతో దారుణంగా హత్య చేసి పరారయ్యారు. వెంకన్నను స్థానిక వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతిచెందారు. ఇతనికి భార్య వెంకటమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హత్యకు కారణాలు ఇలా ఉన్నాయి. మృతుడు వెంకన్న మేనల్లుడైన పల్లెపు భిక్షం, కోటేశ్వరావుకు భూ తగాదాలు ఉన్నాయి. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన దేవెండ్ల అయిలయ్య పల్లెపు భిక్షానికి భూ తగాదాలు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా ఈ తగాదాలు నడుస్తుండగా మృతుడు వెంకన్న పల్లెపు భిక్షానికి భూ తగదాలలో సహకరిస్తున్నాడు. దీనిని జీర్ణించుకోలేని కోటేశ్వరావు, అయిలయ్యలు ఇతని అడ్డు తొలగించుకునేందుకు పథకం వేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా అనేక మార్లు తగదాలు జరిగాయని, ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కుటుంబ సభ్యులతో నిద్రిస్తున్న వెంకన్నను తలపై మారణాయుధాలతో దాడిచేసి హత్య చేసినట్లు వెల్లడించారు. సంఘటన స్థలాన్ని ఏసిపి నరేష్‌రెడ్డి, సిఐ సాంబరాజు సందర్శించగా ఎస్సై రంజిత్‌కుమార్ కేసు నమోదు చేయగా సిఐ పర్యవేక్షిస్తున్నాడు. సంఘటనకు సంబంధించిన వివరాలను భార్య చల్లా వెంకటమ్మ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాలిన గాయాలతో యువతి మృతి
కామేపల్లి, మే 28: మండల పరిధిలోని రేపల్లెవాడకు చెందిన యువతి కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందడంతో సోమవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం రేపల్లెవాడకు చెందిన తేజావత్ అరుణ (22) గత వారం రోజుల క్రితం కుటుంబ సభ్యులతో ఘర్షణ పడి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. శరీరం పూర్తిగా కాలడంతో వైద్య చికిత్స కోసం ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్‌కుమార్ తెలిపారు.

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
తిరుమలాయపాలెం, మే 28: మండలంలోని పిండిప్రోలు గ్రామానికి చెందిన పంజా శ్రీను (40) సోమవారం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం శ్రీను భార్య నాలుగు సంవత్సరాల క్రితం చనిపోయింది. తనకుమారుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మనస్థాపం చెందిన శ్రీను ఏంచేయాలో పాలుపోక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎండి లతీఫ్‌షరీఫ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.