క్రైమ్/లీగల్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామేపల్లి, మార్చి 20: పంట దిగుబడి లేక అప్పులు తీర్చలేమనే భయంతో మనస్థాపనికి గురై రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని భాసిత్‌నగర్ పంచాయతీ పరిధిలోని రేపల్లెవాడ గ్రామానికి చెందిన బానోత్ భావుసింగ్ (29) అనే యువరైతు తనకున్న ఎకరం 10 కుంటల చేనుతో పాటు తన సోదరుడికి చెందిన మరో రెండున్నర ఎకరాల భూమిని సాగు చేస్తున్నాడు. ఈ భూమిలో గత రెండు ఏళ్ళుగా మిర్చి సాగు చేస్తూ సరైన దిగుబడి లేక తీవ్రంగా నష్టపోయాడు. సుమారు రూ.3 లక్షలకు పైగా అప్పులు అయ్యాయి. ఈ ఏడాది కూడా మిర్చి, పత్తి పంట సాగు చేశాడు. ఈ ఏడాది అప్పులు తీరుతాయన్న భావనతో పంటలు సాగు చేసిన రైతు భావుసింగ్‌కు సరైన దిగుబడి లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. చేసిన అప్పులు తీర్చాలేమన్న భయంతో మనస్ధాపనికి గురై సోమవారం మధ్యాహ్నం తన పంట చేనులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయాన్ని చుట్టు పక్కల రైతులు గమనించి ఖమ్మం వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ మేరకు భార్య రాణి మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.