క్రైమ్/లీగల్

అడవిలో కలపను స్వాధీనం చేసుకున్న అటవీశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు, ఏప్రిల్ 5: మండల పరిధిలోని జూలూరుపాడు రేంజి పాపకొల్లు సెక్షన్, పాపకొల్లు బీట్ అటవీ ప్రాంతంలో గత కొంతకాలంగా గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా విలువైన నారవేప చెట్లను నరికి, కలపను తరలిస్తున్నారనే సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు గాలింపు నిర్వహించారు. జిల్లా అటవీశాఖాధికారి రాంబాబు ఆదేశాల మేరకు స్క్వాడ్ అధికారులు మస్తాన్‌రాజు, కోటేశ్వరరావులతోకూడిన బృందం చీమలపాడు, గాడుదులగండి అటవీ ప్రాంతాల్లో పరిశీలించారు. దీంతో నరికిపడేసిన విలువైన నారవేప చెట్లు, కలపను తరలించగా మిగిలన చెట్ల మొట్లును గుర్తించారు. దొరికిన కలపను స్వాధీనం చేసుకుని పాల్వంచ అటవీశాఖ డిపోకు తరలించనున్నట్లు గురువారం అధికారులు తెలిపారు. స్క్వాడ్ బృందం వెంట పాపకొల్లు సెక్షన్ అధికారి సత్యం, బీట్ అధికారి విజయ్‌కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.