క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిడుతూరు, ఆగస్టు 9:మండల పరిధిలోని వీపనగండ్ల గ్రామానికి చెందిన రైతు సోలమన్‌రాజు(35) గురువారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. వివరాలు.. సోలమన్‌రాజు తనకున్న 2 ఎకరాల పొలంలో మొక్కజొన్న, కొంత పొగాకు నారు సాగు చేశాడు. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన సోలమన్‌రాజు ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫీజు పోవడంతో దానిని సరి చేసేందుకు ట్రాన్స్‌ఫార్మర్ దగ్గరకు వెళ్లాడు. ఫీజు వేసే ప్రయత్నంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అతడికి భార్య సువర్ణ, ముగ్గురు సంతానం వున్నారు. వీరిలో ఐదేళ్ల కూతురు అవంతిక వికలాంగురాలు. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబంలో యజమాని మృతి చెందడంతో ఆ కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. కాగా రాజు మృతదేహానికి నందికొట్కూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రైతు ఆత్మహత్య
గూడూరు, ఆగస్టు 9:గూడూరు పట్టణంలోని గొల్లవీధికి చెందిన రైతు మాండ సాయిబాబా(58) గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. మాండ సాయిబాబాకు 3.5 ఎకరాల పొలం ఉంది. ఈ పొలంతో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఏటా సాగు చేసిన పంటలకు ఆశించిన మేరకు దిగుబడులు రాక ఏటా నష్టపోయాడు. ఏటా పంటల సాగుకు అవసరమయ్యే పెట్టుబడులకు పట్టణంలో దాదాపు రూ. 5 లక్షల వరకూ అప్పులు చేశాడు. ఈ ఏడాది కూడా ఆ రైతుకు పంటల నుంచి నష్టం వాటిల్లే పరిస్థితులు వచ్చాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సాయిబాబా ఉదయం పొలం దగ్గరే పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇది గమనించిన తోటి రైతులు వెంటనే అతడిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు. విషయం తెలిసిన వెంటనే గూడూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా సాయిబాబాకు భార్య భాగ్యలక్ష్మీ, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.

చికిత్స పొందుతూ రైతు మృతి
నందికొట్కూరు, ఆగస్టు 9:మండల పరిధిలోని శాతనకోట గ్రామానికి చెందిన రైతు బలగం చిన్న రంగస్వామి(48) కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. ఈ నెల 5వ తేదీ గ్రామంలోని తన సొంత పొలంలో మొక్కజొన్న, వరిపైరుకు క్రిమిసంహారకమందు పిచికారి చేస్తూ పొలంలోనే కుప్పకూలాడు. వెంటనే కుటుంబీకులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ మృతిచెందాడు. తండ్రి పెద్ద సుంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నల్లప్ప తెలిపారు.