క్రైమ్/లీగల్

దొంగ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 24:ఇళ్లకు కన్నం వేసి చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేసి అతడి నుంచి రూ. 12 లక్షల విలువైన 440 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ తెలిపారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ శుక్రవారం విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. డోన్ పట్టణంలోని హోం టౌన్‌కు చెందిన రేగటి లక్ష్మీదేవి ఇంట్లో ఈ నెల 1వ తేదీ సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. చోరీ జరిగిన ఇంట్లో లభించిన వేలిముద్రల ఆధారంగా దొంగను గుర్తించామన్నారు. డోన్ డీఎస్పీ ఖాదర్‌బాషా ఆధ్వర్యంలో సీఐ రాజగోపాల్‌నాయుడు, ఎస్‌ఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్ బాషా, బాలప్రసాద్‌సింగ్, నాగరాజు, నాగన్న దొంగ సమాచారం కనుగొన్నారు. డోన్ పట్టణంలోని కేఈ మాదన్న నగర్‌లో అద్దెకు ఉంటున్న ఇంటి వద్ద దొంగను అదుపులోకి తీసుకుని విచారించగా అతడు గుంటూరు జిల్లా సత్తెనపల్లి గ్రామానికి కాకాని సాంబశివరావుగా గుర్తించారు. చిన్నతనంలోనే అతడి తండ్రి తల్లిని వదిలి పెట్టడంతో తండ్రి పెంపకానికి దూరమై చెడు అలవాట్లకు బానిసైన సాంబశివరావు చెడు స్నేహితుల సహవాసంతో 14 ఏళ్ల వయస్సు నుంచే చోరీలు చేయడం ప్రారంభించాడు. 2006లో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో చోరీ కేసులో జువైనల్‌గా శిక్షను సైతం అనుభవించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ డోన్ పట్టణంలోని పలు కాలనీల్లో చోరీలకు పాల్పడుతూ ఉండేవాడన్నారు.