క్రైమ్/లీగల్

డోన్‌లో విజిలెన్స్ అధికారుల దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోన్, సెప్టెంబర్ 20:డోన్ పట్టణంలోని పాతపేటలో గురువారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించి సుమారు రూ. 3 లక్షల విలువ చేసే వివిధ రకాల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా పాతపేటకు చెందిన కె.రాజు, వి.మోహన్, గుండా సతీష్‌కుమార్, రహిమాన్ ప్రభుత్వం నిషేధం విధించిన గుట్కా వ్యాపారాన్ని గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు. ఈ విషయం గురించి స్థానికులు విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏసీపీ శివకోటి ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారి జయన్న ఆధ్వర్యంలో గురువారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వివిధ దుకాణాల్లో గుట్టుగా దాచి వుంచిన సుమారు రూ. 2.7 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గుట్కా వ్యాపారం చేస్తున్న పాతపేటకు చెందిన రాజు, మోహన్, సతీష్, రహిమాన్‌లపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విజిలెన్స్ అధికారి జయన్న తెలిపారు. దాడిలో హెడ్ కానిస్టేబుళ్లు మునిస్వామి, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నట్లు వారు తెలిపారు. ఇదిలా ఉండాగ ఈ సమాచారం అందుకున్న మరి కొందరు వ్యాపారులు దుకాణాలు మూసివేసి పరారయ్యారు. విచారణలో మరి కొందరి పేర్లు తేలినట్లు అధికారులు తెలిపారు.

రూ. 300 కోసం ఘర్షణ.. మహిళకు తీవ్రగాయాలు..
* ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చేరిక..
ఆత్మకూరు, సెప్టెంబర్ 20:కొత్తపల్లి మండల పరిధిలోని శివపురం గ్రామ శివారులో ఉన్న చెంచుగూడెంలో గురువారం రూ. 300 కోసం లింగన్న, అతడి బావ బుడ్డన్న మధ్య జరిగిన గొడవలో లింగన్న చెల్లెలు లింగమ్మ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బావ అయిన బుడ్డన్నకు లింగన్న కొద్ది రోజుల క్రితం రూ. 300 అప్పుగా ఇచ్చాడు. గురువారం ఉదయం ఆ రూ. 300 ఇవ్వాలంటూ బావతో లింగన్న గొడవకు దిగాడు. అయితే బుడ్డన్న నీ డబ్బులు తిరిగి ఇచ్చానని, నీకు బాకీ లేనని చెప్పడంతో తాగిన మైకంలో ఇంటిలో ఉన్న కొడవలి తీసుకుని లింగన్న బావపై దాడి చేయబోగా వారిని విడిపించేందుకు లింగమ్మ అడ్డుగా రావడంతో ఆమెకు తలపై కొడవలి బలంగా తగలడంతో అక్కడే కుప్పకూలిపోయింది. దీంతో చుట్టుపక్కల ఉన్న సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన లింగమ్మను ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి సిఫారసు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.