రాష్ట్రీయం

కృపామణి కేసులో గుడాల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 28 : రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని రేకెత్తించిన కృపామణి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన గుడాల సాయి శ్రీనివాస్‌ను పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. తనను తన కుటుంబ సభ్యులు, గుడాల సాయి శ్రీనివాస్ వ్యభిచారం చేయాలంటూ బ్లాక్‌మెయిల్ చేశారని, ఈ బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరుకు చెందిన కృపామణి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ బాధలను, కష్టాలను ఆమె స్వయంగా సూసైడ్ నోట్‌లో పేర్కొనడమే కాకుండా సెల్ఫీలో వీడియో తీశారు. ఈ సమాచారం బయటకు రావడంతో కృపామణి ఆత్మహత్య తీవ్ర సంచలనానే్న సృష్టించింది. విభిన్న వర్గాలు, ప్రజా సంఘాలు కూడా ఆమె ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో జిల్లా పోలీసు శాఖ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించింది. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ కేసులో పర్యవేక్షణ చేశారు. కాగా ఈ కేసులో ఈ నెల 4వ తేదీన నిందితులైన కృపామణి తల్లిదండ్రులు, తమ్ముడు, మరో మహిళను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కాగా ప్రధాన నిందితుడైన గుడాల సాయి శ్రీనివాస్ అప్పటి నుంచి పరారీలో వున్నాడు. అతను ఘటన వెలుగు చూసిన వెంటనే జిల్లా నుంచి విశాఖపట్నం, అక్కడ నుంచి హైదరాబాద్‌కు అక్కడ నుంచి పూణెకు తన మకాం మారుస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. కాగా ఇతన్ని అరెస్టు చేసేందుకు జిల్లా ఎస్‌పి భాస్కర్‌భూషణ్ పర్యవేక్షణలో మొత్తం 9 టీమ్‌లను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలను చేపట్టారు. చివరకు శనివారం పశ్చిమగోదావరి జిల్లాలోని పెరవలి వంతెన సమీపంలో అతన్ని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్‌పి భాస్కర్ భూషణ్ తెలిపారు. ఇతనిపై ఇంతకుముందే మూడు కేసులు వున్నాయని, పెరవలి పోలీసుస్టేషన్‌లో రౌడీ షీట్ కూడా వుందని తెలిపారు. సాయి శ్రీనివాస్‌పై ఆత్మహత్యకు ప్రేరేపించడం, వేధింపులు, అక్రమ రవాణా తదితర అంశాలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో సమర్ధంగా వ్యవహరించిన జంగారెడ్డిగూడెం డిఎస్పీ జె వెంకట్రావు, కొవ్వూరు డిఎస్పీ ఎన్ వెంకటేశ్వరరావులను, పోలీసు బృందాలను ఎస్పీ అభినందించారు.