ఆంధ్రప్రదేశ్‌

కృష్ణాలో సాగు ప్రశ్నార్థకం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాగునీటి కోసం అర్రులు చాస్తున్న డెల్టా ప్రజలు పడిపోయిన ప్రకాశం బ్యారేజీ నీటి మట్టం

విజయవాడ, మార్చి 11: గడచిన 120 ఏళ్ల చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా కృష్ణానదిలో ఎగువ ప్రాంతాలైన ఆల్మట్టి, నారాయణపూర్ వంటి భారీ సాగునీటి ప్రాజెక్టుల నుంచి దిగువకు ఈ దఫా చుక్కనీరు కిందకు రాలేదు. అయితే అదృష్టవశాత్తు ఆయా ప్రాజెక్టులు దిగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల క్యాచ్‌మెంట్ ఏరియాల్లో వాగులు, వంకలు పొంగి గత సెప్టెంబర్‌లో దాదాపు 66 టిఎంసిల నీరు దిగువకు చేరింది. దీనివల్ల రూ.22 లక్షల ఎకరాల ఆయకట్టు కల్గిన సాగర్ కింద ఈదఫా రబీ కాదు కదా ఖరీఫ్ కూడా లేకుండా పోయింది. ఇక కృష్ణాడెల్టాలో 13 లక్షల ఎకరాలకు గాను అదీ ఒక్క ఖరీఫ్ సీజన్‌లో కేవలం 8 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. పట్టిసీమ నుంచి తీసుకువచ్చిన 8 టిఎంసిల గోదావరి జలాల వలనే ఇది సాధ్యమైందంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొప్పగా చెబుతున్నారు. అది వేరే విషయం. ఇదిలా ఉంటే సాగర్ నుంచి హైదరాబాద్‌కు తాగునీటి అవసరాల కోసం 550 క్యూసెక్కుల నీరు పంపింగ్ ద్వారా సరఫరా జరుగుతోంది. కృష్ణాడెల్టా ఆయకట్టు పరిధిలో దాదాపు 66 మండలాల్లోని 960 గ్రామాల్లో పలు పట్టణాల్లో ఇప్పటికే తాగునీటి ఎద్దడి నెలకొంది. దీనికి తగ్గట్లు ఏడాది పొడవునా ప్రకాశం బ్యారేజీకి 12 అడుగుల నీటిమట్టం కొనసాగాల్సి వుంటే ప్రస్తుతం దారుణాతి దారుణంగా గురువారం నాటికి 7.4 అడుగులకు పడిపోయింది. కనీసం 9.5 అడుగులు ఉంటేగాని గుంటూరు ఛానెల్ ద్వారా గుంటూరు పరిసరాలకు తాగునీరు వెళ్లే అవకాశం లేదు. దీంతో ప్రస్తుతం శక్తివంతమైన మోటార్ల ద్వారా కృష్ణానదిలో అడుగంటిన నీటిని తోడేస్తున్నారు. ఇక 1260 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ కూడా శక్తివంతమైన పంపులతో నీటిని తోడేసుకోవాల్సి వస్తోంది. ప్రకాశం బ్యారేజి వద్ద 12 అడుగుల్లో నీటిమట్టం ఉంటే నయాపైసా ఖర్చు లేకుండానే గ్రావెటీకై విటిపిఎస్ కాలువలోకి నీరు ప్రవహించేది. ప్రస్తుతం తాగునీటి అవసరాల కోసం దిగువ రెండు లేదా మూడు టిఎంసిల నీరు అదీ అప్పుడప్పుడు విడుదలవుతూ మార్గమధ్యంలోనే అత్యధిక శాతం ఆవిరైపోతోంది. ఇదిలా ఉంటే జూన్ మాసాంతానికి పట్టిసీమ నుంచి కృష్ణాడెల్టాకు 80 టిఎంసిల నీరు అందిస్తానంటూ సిఎం చంద్రబాబు నాయుడు ప్రగల్భాలు పలుకుతున్నారు. అయితే ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో వ్యూహాత్మకంగా జూరాల నుంచి గాక ఏకంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచే 323 మీటర్ల ఎత్తుపై శక్తివంతమైన మోటార్ల ద్వారా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కొత్తగా 10 లక్షల ఎకరాలకు సాగునీరు, మార్గమధ్యంలో వందలాది గ్రామాలకు తాగునీటి అవసరాల కోసం 90 టిఎంసిల నీటిని అదీ కేంద్రం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేనందున తరలించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ రైతు సంఘం సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకోసం కాలువల తవ్వకాలు, భూసేకరణ నిమిత్తం రూ.30 వేల కోట్లతో టెండర్లు పిలిచారని ఎంతోకాలం క్రితమే బహిరంగంగా శంకుస్థాపనలు జరగినా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేటి వరకు నోరు మెదపటం లేదన్నారు. మరోవైపు గోదావరి నదిపై కూడా తెలంగాణాలో అక్రమ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణం జరగబోతోందన్నారు.