క్రైమ్/లీగల్

* వరుడుతో సహ పదిమందిపై కేసులు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, సెప్టెంబర్ 3: వివాహం చేసుకోవాల్సిన వధూవరులు కల్యాణ మండపానికి వెళ్ళకుండా పోలీస్ట్‌షన్‌కు వెళ్ళారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉనాయి. తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామానికి చెందిన మేరుగ దివ్య(23)కు పామర్రు మండలం నిభానుపూడికి చెందిన అరిసే నాగశ్రీనుతో వివాహం నిశ్చయమయింది. జూన్ 22న అట్టహాసంగా ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం జరిగింది. సెప్టెంబర్ 2వ తేదీ రాత్రి 9.51 గంటలకు పామర్రులోని పాల శీతలీకరణ కల్యాణ మండంలో వివాహం జరిపేందుకు పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు. ఎంగేజ్‌మెంట్ రోజున దివ్యతల్లి, బంధువులు శుభలేఖలు వేయించి బంధువులకు, శ్రేయోభిలాషులకు పంపిణీ చేశారు. ఆదివారం రాత్రి 9.51 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. అయితే వధువు దివ్య బంధువులతో తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నాగశ్రీను పెళ్లికి నిరాకరిస్తున్నాడని, దివ్యకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. సుమారు 100 మంది దివ్య బంధవులు పోలీస్‌స్టేషన్ ఎదుట రాత్రి పొద్దుపోయే వరకు ఆందోళన చేస్తునే ఉన్నారు. దీంతో పోలీసులు నిభానుపూడి నుంచి వరుడు నాగశ్రీనుని, బంధువులను తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకు వచ్చారు. ఇరువురు తమతమ వాదనలను వినిపించారు. తాను పెళ్లికి సిద్ధమని దివ్య చెపుతుండగా నాలుగు రోజుల క్రితం పెళ్లి ఇష్టంలేదని ఫోన్‌లో దివ్య చెప్పిందని, ఆమె వాయిన్‌ని రికార్డ్ చేశానని నాగశ్రీను పోలీసులకు చెప్పాడు. కొన్ని రోజుల నుంచి దివ్య తన ఫోన్‌కి స్పందించటం లేదని, ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తున్నాడని ఎస్‌ఐ తెలిపారు. మొత్తం మీద ఇద్దరి మధ్య సెల్ సంభాషణలు చిచ్చుపెట్టినట్టు స్పష్టం అవుతోంది. పెళ్లికి నిరాకరిస్తున్న నాగశ్రీనుపై కేసు నమోదు చేయాల్సిందేనని దివ్య బంధువులు పట్టుబట్టారు. ఆదివారం అర్ధరాత్రి 11.30 గంటలకు దివ్య పోలీసులకు ఫిర్యాదు అందించింది. దీంతో 12 గంటలకు వరుడు నాగశ్రీను, మరో పదిమంది బంధువులపై 417, 420, 506 సెక్షన్‌ల కింద ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.