క్రైమ్/లీగల్

గంజాయి అమ్మకం, సరఫరా కేంద్రాలపై టాస్క్ఫోర్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకరంపుర కరీంనగర్, ఫిబ్రవరి 6: కరీంనగర్ కేంద్రంగా గంజాయి అమ్మకం, సరఫరా చేస్తున్న ముఠాలోని ముగ్గురిని కరీంనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి గంజాయి, మోబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని కొత్తపల్లి పోలీసుల సహాయంతో రిమాండ్‌కు తరలించారు. మంగళవారం కొత్తపల్లి పరిధిలో గల శాంతినగర్‌లోని ఒక మామిడితోట కేంద్రంగా గంజాయి సేవిస్తూ, అమ్మకాలు జరుపుతున్న మహ్మద్ అన్వర్, మహ్మద్ ఫిరోజ్‌లను అరెస్ట్ చేయగా వారితో ఉన్న నజీర్ అనే వ్యక్తి ఫరారీలో ఉన్నాడు. వారి వద్ద నుండి ప్యాకెట్ల రూపంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరికి సప్లై చేస్తున్న వ్యక్తి ఆచూకీ తెలుసుకొని కరీంనగర్‌లోని గాయత్రినగర్‌కు చెందిన మహ్మద్ జహంగీర్ ఇంటిపై దాడి చేయగా అక్కడ కూడా ప్యాకెట్ల రూపంలో గంజాయి లభించడం జరిగింది. వారి వద్ద నుండి వారి మోబైల్స్ కూడా స్వాధీనం చేసుకొని కొత్తపల్లి పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ సిఐలు శ్రీనివాస రావు, మాధవి, కిరణ్, కొత్తపల్లి ఎస్‌ఐ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.