క్రైమ్/లీగల్

ఉరి వేసుకొని యువకుని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మికుంట, మార్చి 21: మండలంలోని తనుగుల గ్రామానికి చెందిన జులుక సాగర్ (32) అనే యువకుడు బుధవారం అత్మహత్య పాల్పడ్డడు. గ్రామస్తులు ,బంధువులు తెలిపిన ప్రకారం గ్రామానికి చెందిన జిలుక సాగర్ అనే యువ రైతు తన ఉండబడే రెండు ఎకరముల భూమితోపాటు మరో రెండు ఎకరములు కౌలుకు తీసుకొని వ్యవసాయ చేస్తు జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తుండగా, పంట వేసిన చేనుకు నీరులేక ఎండిపోయింది.5లక్షల రూపాయలు అప్పు కాగా,అప్పులు తీర్చే మార్గం లేక ,మనస్థాపంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని అత్మహత్యకు పాల్పడ్డడు. మృతునికి రెండు ఎళ్ళ కుమారుడు ఉన్నాడు. భార్య భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నట్లు సి ఐ ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 110 మంది పట్టివేత
కరీంనగర్ టౌన్, మార్చి 21: పోలీస్ కమీషనరేట్ పరిధిలోమంగళవారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 110మంది మందుబాబులు పట్టుబడగా, వీరిని కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపర్చనున్నారు. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 12గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో 18 పోలీస్‌స్టేషన్ల పరిధిలో 500మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకున్నారు. డ్రోన్ కెమెరాల సాయంతో ఇరుకు సందుల గుండా వెళ్తున్న మందుబాబులను గుర్తించి పట్టుకున్నారు. వాహనాలకు సరైన ధృవపత్రాలు లేని వారిని గుర్తించి 78వాహనాలకు రూ.22వేల 200 జరిమాన విధించారు. ఈ తనిఖీలను పోలీస్ కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుశిక్ష తప్పదనే భావన వాహనదారుల్లో వచ్చిందని, గతంతో పోల్చితే ఈమధ్యకాలంలో తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం మద్యంసేవించి వాహనాలు నడపటంతోనే జరుగుతున్నాయని, 2016లో దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల మూలంగా 1.5లక్షల మంది మృత్యువాత పడ్డారని, అతివేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి నడపటంతోనే ఇవి సంభవిస్తున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ప్రజల భద్రత కోసమే స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ, తరచూ పట్టుబడే వారి లైసెన్సులు రద్దుకోసం అధికారులకు సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో అర్ధరాత్రి వేళల్లో ఇంటికి వస్తుండగా, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యేవారని, స్పెషల్ డ్రైవ్‌ల మూలంగా సకాలంలో ఇంటికి చేరుతుండగా హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమానికి అన్ని వర్గాల మహిళలు మద్ధతు తెల్పుతున్నారని, ప్రమాదాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గినట్లు వివరించారు. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో కూడా ఈ కార్యక్రమం కొనసాగించనున్నట్లు సిపి తెలిపారు.