క్రైమ్/లీగల్

వడదెబ్బతో హోంగార్డు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకరపట్నం, మే 19: శంకరపట్నం పోలీసు స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న మొలంగూర్ గ్రామానికి చెందిన పకురుల్లా వడదెబ్బతో శనివారం మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా శంకరపట్నం పోలీసు స్టేషన్‌లో పరుకుల్లా హోంగార్డుగా పనిచేస్తు అందరితో కలిసిమెలసి ఆప్యాయంగా పలకరించేవాడని, అతడు వడదెబ్బతో మృతి చెందడం తమను దిగ్బ్రాంతికి గురిచేసిందని మండల ప్రజలు అన్నారు. పకురుల్లా మృతి పట్ల జడ్పీటీసి సంజీవరెడ్డి, సర్పంచ్ వెంకటేష్, ఎంపిటీసి రాజు, హుజురాబాద్ ఎసిపి కృపాకర్, హుజురాబాద్ రూరల్ సిఐ రవికుమార్, ఎస్‌ఐ ఎల్లాగౌడ్, పోలీసు స్టేషన్ సిబ్బందితోపాటు పలు గ్రామాల ప్రజాప్రతినిదులు సంతాపం వ్యక్తం తెలిపారు.

అక్రమంగా జీడిపప్పు రవాణా చేసే ఇద్దరి పట్టివేత
గోదావరిఖని, మే 19: పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి ఎలాంటి బిల్లులు లేకుండా జీడి పప్పు రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను రామగుండం కమిషనరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. శనివారం కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ రవి కుమార్ వివరాలను వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన తంగళ్లపల్లి నానిబాబు, సుబ్బారావు అనే ఇద్దరు వ్యక్తులను ఎపి 37 సి ఆర్ 5589 అనే కారులో గోదావరిఖనిలోని మేదర్ బస్తీ ప్రాంతాలోని పలు షాపులకు బిల్లులు లేకుండా జీడి పప్పును రవాణా చేస్తున్నారని సమాచారం మేరకు తనిఖీ చేసి పట్టుకున్నట్లు తెలిపారు. జీడి పప్పు విలువ సుమారు 2.30లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టాస్క్ఫోర్స్ ఎసిపి విజయసారథి పాల్గొన్నారు.

అనుమానాస్పదస్థితిలో రైల్వే ఉద్యోగి మృతి
పెద్దపల్లి, మే 19: రైల్వే కాలనీ క్వార్టర్‌లో నివాసముంటున్న రైల్వే ఉద్యోగి వేల్పుల శ్రీ్ధర్ (35) అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పెద్దపల్లి పోలీసులు రైల్వే క్వార్టర్స్‌లో మృతి చెందిన శ్రీ్ధర్‌ను గుర్తించి ప్రభుత్వ ఆసుప్రతిలోని మార్చురీకి తరలించారు. పోలీసుల సమాచారంతో శ్రీ్ధర్ భార్య అక్కడికి చేరుకుంది. గత కొనే్నళ్ళుగా తన భర్త శ్రీ్ధర్ తాగుడుకు బానిస కావటం, దీంతో తరచూ గొడవలు జరుగుతుండేవని, ఈ క్రమంలో తాను 6నెలల క్రితం పుట్టింటికి వెళ్లినట్లు, అతిగా మద్యం సేవించి శ్రీ్ధర్ మృతి చెందినట్లుగా భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మృతుడికి ముగ్గురు పిల్లలున్నారు. భార్య అంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీష్ తెలిపారు.