రాష్ట్రీయం

60ఏళ్లలో కాంగ్రెస్, తెదేపా చేయలేనిది.. ఐదేళ్లలో చేసి చూపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రి కెటిఆర్ ప్రతిన

హైదరాబాద్, డిసెంబర్ 12: ఆరుదశాబ్దాల పాటు కాంగ్రెస్, టిడిపి అధికారంలో ఉండి చేయలేనిది ఐదేళ్లలో చేసి చూపిస్తామని ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. హైదరాబాద్‌లోని కవాడిగూడ జీర ప్రాంతంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ నగరంలో వర్షపు చినుకు పడితే పడవలపై వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, ఈ పరిస్థితికి ఏడాదిన్నర టిఆర్‌ఎస్ పాలన కారణమా, ఇంత కాలం ఏమీ చేయని పాలకులు కారణమా? అని ప్రశ్నించారు. కెసిఆర్ మనసున్న ముఖ్యమంత్రి అని, పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. పేదలనుంచి పైసా తీసుకోకుండా మొత్తం వ్యయం ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. నగరంలో ప్రతి పేదవాడికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు లభిస్తాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇంత కాలం రాష్ట్రంలో ఏమీ చేయని వారు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమకు అధికారం అప్పగిస్తే ఏదో చేసేస్తామని అంటున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 34లక్షల మందికి నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తున్నట్టు చెప్పారు. పేదలందరికీ కళ్యాణలక్ష్మి పథకం కింద వివాహానికి 51వేల రూపాయలు ఇస్తున్నట్టు తెలిపారు.
తొమ్మిదిన్నర లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా పథకం ప్రవేశపెట్టినట్టు తెలిపారు. మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ కొతలు లేని వేసవిని హైదరాబాద్ వాసులు చూసి ఉండరని కానీ కెసిఆర్ దూరదృష్టితో వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చేసినట్టు చెప్పారు. నగరానికి నీటిని అందించే జలాశయాలు అన్నీ ఎండిపోయినా కెసిఆర్ ముందు చూపుతో కృష్ణా, గోదావరి జలాలను హైదరాబాద్‌కు తరలించినట్టు కెటిఆర్ తెలిపారు.