రాష్ట్రీయం

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు : ఐదుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలిమిగుండ్ల/ఆళ్లగడ్డ, నవంబర్ 21: కర్నూలు జిల్లాలో శనివారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. కొలిమిగుండ్ల మండలంలో లారీ ఢీకొని ముగ్గురు బాలికలు మృతి చెందగా, ఆళ్లగడ్డలో ట్రాక్టర్ ట్రాలీని అంబులెన్స్ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాలలో శనివారం ఉదయం తిరుపతమ్మ(16), కావ్య(12), రాజేశ్వరి(14) పాలు తీసుకుని రోడ్టు దాటుతుండగా తాడిపత్రి నుంచి వచ్చిన లారీ ఢీకొంది. దీంతో రాజేశ్వరి, కావ్య అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన తిరుపతమ్మను ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా బాలికలను ఢీకొన్న లారీ డ్రైవర్ ఆపకుండా వేగంగా వెళ్తూ ఎదురుగా వచ్చిన సిమెంటు లోడు లారీని ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు లారీ డ్రైవర్లకు తీవ్రగాయాలయ్యాయి. మరో సంఘటనలో ఆళ్లగడ్డ సమీపంలో జాతీయ రహదారిపై ట్రాక్టర్ ట్రాలీని అంబులెన్స్ ఢీకొనడంతో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన డ్రైవర్ శివ(36), అనిల్‌కుమార్‌రెడ్డి(20) అక్కడికక్కడే మృతి చెందారు. ఓ రోగిని కర్నూలు ఆసుపత్రిలో చేర్పించి తిరుగుప్రయాణంలో వీరు ప్రమాదం బారిన పడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.