రాష్ట్రీయం

కురుమూర్తిరాయ.. కోర్కెలు తీర్చ రావయ్యా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నచింతకుంట, నవంబర్ 21: మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింత కుంట మండలంలో శ్రీకురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక శనివారం సందర్భంగా పల్లె ప్రాంతాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం నుండి కొండ దిగువ ప్రాంతం నుండి స్వామి వారి ప్రధాన ఆలయం వరకు భక్తులు బారులు తీరి స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీ కురుమూర్తి స్వామి, లక్ష్మిదేవి అమ్మవారులు ఆంజనేయస్వామి, చెన్నకేశవ ఆలయాల్లో భక్తుల తాకిడి అధికమైంది. ఉద్దాల మంటపానికి భక్తులు చేరుకుని స్వామివారి పాదాలను తాకితే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. స్వామి పాదుకలను వీపుపై తాకితే పాపాలు తొలుగుతాయనే నమ్మకంతో భక్తులు స్వామివారి పాదాలను తాకేందుకు పోటీ పడ్డారు. స్వామి వారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి తడిగుడ్డలతో స్వామివారిని దర్శించుకున్నారు. మట్టి కుండలో పరమాన్నం పచ్చిపులుసుతో స్వామికి నైవేద్యం సమర్పించి మొక్కులు సమర్పించుకున్నారు. జాతర మైదానంలో వ్యాపార దుకాణాల వద్ద మహిళలు కొనుగోలు సందడి నెలకొంది. జాతరలో చిన్నారుల సరదాకోసం రంగుల రాట్నాలు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంత మంతా చిన్నారుల కేరింతలతో నిండిపోయింది.