ఆంధ్రప్రదేశ్‌

కార్మిక చట్టాల అమలులో విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మార్చి 14:రాష్ట్రంలో కార్మిక చట్టాలను అమలుచేయటంలో ప్రభుత్వం విఫలం చెందినట్లు ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు, ప్రపంచకార్మిక సమాఖ్య ఉపాధ్యక్షుడు డాక్టర్ జి సంజీవరెడ్డి ఆరోపించారు. సోమవారం ఒంగోలులోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ,ప్రైవేటు పరిశ్రమలు,వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న కార్మికులు, కాంట్రాక్టుకార్మికులు సమస్యలు వచ్చిన సమయంలో యజమానులు లేబర్ ఆఫీసర్లను విచారణకు కార్యాలయాల్లోకి రాకుండా లబ్ధిపొందుతున్నట్లు తెలిపారు. కార్మికులకు కనీస వేతనాలు అమలుపర్చటంలో యజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఐఎన్‌టియుసి మొదటినుండి ముందంజలో ఉందని తెలిపారు. అనేక పరిశ్రమలు చట్టాలను అమలుచేయనప్పటికి ప్రభుత్వ యంత్రాంగం యజమానులకు తొత్తులుగా మారి కార్మికులను ఇబ్బందులపాలుచేస్తున్నారని తెలిపారు.

రైలు ఢీకొని ముగ్గురి మృతి
కొత్తవలస, మార్చి 14: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి రైల్వేస్టేషన్‌లో సోమవారం రైలు ఢీకొని ముగ్గురు ఒడిశావాసులు మృతి చెందారు. కంటకాపల్లి స్టేషన్ మూడవ ఫ్లాట్‌ఫారంపై ఈ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు ఎక్కేందుకు ఫ్లాట్‌ఫారంపైకి చేరుకోగా అదే సమయంలో వచ్చిన రామేశ్వరం - భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొంది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో భార్యాభర్తలు, ఓ బాలిక ఉన్నారు. వీరి వివరాలు తెలియరాలేదు.

నీలం జ్యూట్ మిల్ లాకౌట్
శ్రీకాకుళం, మార్చి 14: శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం సమీపంలోని నీలం జ్యూట్ మిల్లు యాజమాన్యం సోమవారం లాకౌట్ ప్రకటించింది. ఈ ప్రాంత రైతులు గోగు సాగుచేయడం తగ్గించడంతో మిల్లులో ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. సరిపడ ముడిసరుకు దొరక్కపోవడంతో ఉత్పత్తి చేయలేకపోతున్నామని, ఫలితంగా నష్టాలు పెరుగుతున్నాయని యాజమాన్యం పేర్కొంది. ఈ నేపధ్యంలో నో వర్క్, నో పే నినాదంతో యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. మిల్లు మూతబడడంతో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇదిలా ఉండగా యాజమాన్యం చర్యను నిరసిస్తూ మిల్లు కార్మికులు ఆందోళనకు దిగారు. లాకౌట్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4కోట్లు
తిరుమల, మార్చి 14: శ్రీవేంకటేశ్వరస్వామివారికి భక్తులు హుండీ ద్వారా స్వామికి సమర్పించిన కానుకలు ద్వారా రూ.4కోట్లు ఆదాయం లభించింది. శనివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సమర్పించిన కానుకలను ఆదివారం పరకామణి సిబ్బంది లెక్కించగా ఈమేరకు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. కాగా సోమవారం సాయంత్రం 6గంటలకు అందిన సమాచారం మేరకు సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునేందుకు 3 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివుండగా దర్శనానికి 2గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తులు స్వామి దర్శనం కోసం వేచివుండే పనిలేకుండా నేరుగా స్వామి దర్శనానికి వెడుతున్నారు. సోమవారం తెల్లవారు జామున 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు 50,605మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
విశాఖపట్నం, మార్చి 14: బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీమ వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకటి, రెండు చోట్ల జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు.

డివైడర్‌ను ఢీకొని లారీ దగ్ధం
పూతలపట్టు, మార్చి 14 : చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఓ లారీ డివైడర్‌ను ఢీకొని దగ్ధమైన సంఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. కోలార్ నుంచి తిరుపతికి కూరగాయల లోడుతో వస్తున్న లారీ చవటపల్లి బ్రిడ్జి వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. డీజల్ ట్యాంకు నుంచి మంటలు చెలరేగి క్షణాల్లో లారీ అంతటా వ్యాపించాయి. డ్రైవర్ చాకచక్యంగా లారీ నుంచి దూకేశాడు. లారీలోని కూరగాయలు మొత్తం కాలిపోయి 12లక్షలు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఎస్సై మురళీమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

117 మంది మిలీషియా సభ్యుల లొంగుబాటు
సీలేరు, మార్చి 14: ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో 117 మంది మిలీషియా, గ్రామ కమిటీ, సానుభూతిపరులు సోమవారం ఉదయం మల్కన్‌గిరి ఎస్పీ మిత్రభాను మహాపాత్రో ఎదుట లొంగిపోయారు. ఒడిశా, మల్కన్‌గిరి జిల్లా మత్తిలి పోలీస్‌స్టేషన్ పరిధిలో పహారా గ్రామానికి చెందిన గిరిజనులు మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. దీంతో ప్రభుత్వపరంగా వారి గ్రామాలకు ఎటువంటి అభివృద్ధి జరగకపోగా అధికారులు ఆ గ్రామాలకు వెళ్ళడం మానేశారు. దీంతో మావోయిస్టు కార్యకలాపాలతో విసిగి ఎస్పీ ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. 34 మంది మహిళలు, మిలీషియా సభ్యులు, ముగ్గురు జన నాట్యమండలి సభ్యులు, ఏడుగురు గ్రామకమిటీ సభ్యులు, మావోయిస్టు మద్దతుదారులు ఉన్నారు.