రాష్ట్రీయం

ఏపిలో తెరపైకి మళ్లీ భూసేక‘రణం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిసెంబర్ 15 తర్వాత నోటిఫికేషన్?

గుంటూరు, డిసెంబర్ 4: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రతిపాదిత ప్రాంతమైన 29 గ్రామాల్లో భూ సమీకరణ ద్వారా ప్రభుత్వానికి 30 వేల ఎకరాల లోపు మాత్రమే రావడంతో మిగిలిన 3 వేల ఎకరాల సేకరణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో రైతులు పొలాలను ఇచ్చేందుకు ఎంతమాత్రం అంగీకరించడం లేదు. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, బేతపూడి, రాయపూడి తదితర గ్రామాల రైతులు కొందరు ఇంతవరకు ప్రభుత్వానికి భూములివ్వని పరిస్థితే ఉంది. సిఆర్‌డిఎ అధికారులు తుళ్లూరు మండలంలో 370 ఎకరాలకు పైగా రావాల్సి ఉందని లెక్కలు తేల్చినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో 2 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వానికి రైతుల నుంచి రావాల్సి ఉంది. అంతేకాకుండా అసైన్డ్, లంకభూములు 2300 ఎకరాలకు పైగా ప్రభుత్వం సమీకరించాల్సి ఉంది. రాష్ట్రప్రభుత్వం రాజధాని నిర్మాణాలకు వేగంగా అడుగులు వేస్తున్న దృష్ట్యా మిగిలిన భూములను కూడా సేకరించిన తరువాతే ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఈనేపథ్యంలో అధికారులు డిసెంబర్ 15 తర్వాత నోటిఫికేషన్ జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇప్పటికే అసైన్డ్ భూములకు నోటిఫికేషన్ ఏ క్షణానైనా జారీచేసే దిశగా చర్యలు చేపట్టింది. అదే సమయంలో పట్ట్భాములు ఇవ్వని రైతుల నుంచి భూ సేకరణ చట్టం ద్వారా భూములు సేకరించేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తోంది. రాష్ట్రప్రభుత్వం భూ సేకరణ నోటిఫికేషన్‌కు ప్రయత్నించిన ప్రతిసారీ ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, రైతులు, ఉద్యమకారులు ఆందోళనకు దిగుతుండడంతో వెనుకంజ వేస్తూ వచ్చింది. అయితే నోటిఫికేషన్ జారీచేస్తుందనే వాదనను ప్రతిపక్షాలు ప్రముఖంగా రైతుల్లో ప్రచారం చేస్తున్నాయి.
ముఖ్యంగా వామపక్ష నేతలు భూ సేకరణ చట్టం అమలును ప్రభుత్వం వెనక్కు తీసుకున్నట్లు భావించవద్దని, ఏ క్షణానైనా నోటిఫికేషన్ జారీచేసే అవకాశముందంటూ రైతులను అప్రమత్తం చేస్తున్నారు. రహదారుల పేరుతో రాష్ట్రప్రభుత్వం విస్తరణకు పూనుకుంటుందనే సమాచారంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్న రైతులు భూ సేకరణ నోటిఫికేషన్ జారీచేస్తే పూర్తిస్థాయి ఉద్యమానికి సన్నద్ధులయ్యేందుకు ప్రతిపక్ష పార్టీలను సంప్రదిస్తున్నారు. అంతేకాకుండా రైతులు న్యాయ పోరాటం చేసేందుకూ సంసిద్ధంగా ఉన్నారు.