రాష్ట్రీయం

కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ రాష్ట్రంలోని పలు డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల్లో కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధం చేయాలని తెలంగాణ ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం ప్రధానకార్యదర్శి డాక్టర్ కె. సురేష్ డిమాండ్ చేశారు. జూనియర్ కాలేజీల్లో ఉన్న పోస్టులను సైతం బడ్జెట్ శాంక్షన్ పోస్టులుగా ఆమోదించాలని సిఎంను కోరామని అన్నారు. ప్రస్తుతం జూనియర్ కాలేజీల్లో 404 ఉన్నాయని, ఇందులో జూనియర్ లెక్చరర్ పోస్టులు బడ్జెట్ శాంక్షన్‌లో 5158 ఉన్నాయని, ఇందులో 1403 మంది రెగ్యులర్ జూనియర్ లెక్చరర్‌లు పనిచేస్తున్నారని అన్నారు. మిగతా 3755 ఖాళీల్లో 10 శాతం నాన్ టీచింగ్ పోస్టులు 385 పోగా, 3380 డైరెక్టు రిక్రూట్‌మెంట్ కోటా కింద ఉన్నాయని, ఇందులో 134 మంది ఎంటిఎస్ వాళ్లు పనిచేస్తున్నారని , మొత్తం కాంట్రాక్టు లెక్చరర్లు 3796 మంది పనిచేస్తున్నారని చెప్పారు. ఇందులో 3164 మంది బడ్జెట్ శాంక్షన్ పోస్టుల్లో పనిచేస్తున్నారని 632 బడ్జెట్ శాంక్షన్ లేని పోస్టులున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కాలేజీలు 2008 నుండి పనిచేస్తున్నాయని ఇందులో 742 జూనియర్ లెక్చరర్ పోస్టులు , 1124 డిగ్రీ లెక్చరర్ పోస్టులు ఉన్నాయని వాటిని వెంటనే ఆమోదించాలని ఆయన కోరారు.