Others

అర్ధనారీశ్వరుని లీల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాలాహాలాన్ని పుక్కిటపట్టి లోకోద్ధారణ చేసిన మంగళప్రదుడు శివుడు. శివా అన్నశబ్దమేశుభాలనులను కలిగించేది.
ఒకానొకకాలంలో క్షీర సాగర మథనంలోంచి పుట్టిన అమృతాన్ని వితరణ చేయడానికి సజ్జన పక్షపాతైన మహావిష్ణువు మోహినీ అవతారుడయ్యాడు. మోహినీ అమృతభాండాన్ని చేత ధరించింది. సర్వజగత్తును తన మాయామోహంలో ముంచేసే ఆ మోహినిరూపాన్ని చూచి పరమశివుని చిత్తమూ చలించింది. అది తెలుసుకొన్న మోహినీ అవతారుడు శివుణ్ణి తప్పించుకొని వెళ్తుండగా ‘‘మోహినీ మోహినీ ఆగు.. ఆగుము’’ అంటూ వెనుకే పరుగెత్తాడు. ఆ శివునికోసం మోహినీఅవతారుడు వెనుక్కు తిరిగాడు. హరి హరుల చూపు కలసింది. హరిహరసుతుడు ఉద్భవించాడు. లోకాలన్నీ హరిహరసుతా నమోనమో అని స్తుతించాయ. అటువంటి పరమేశ్వరుడే ఓసారి లింగాకృతినొందగా మానవులంతా హరహర మహాదేవ శంభోశంకరా అని నుతించారు. దీన్ని చూచిన ఓ పాము, ఓ ఏనుగు, ఓ సాలీడు తమతమ నైజంతో పరమేశ్వర కీర్తన చేశాయ. పిపీలికాది బ్రహ్మ పర్యంతమూ శివమయం అయినా ఓమ్ నమఃశివాయ అని అన్నా, ఓ శివా అని నోరారా పిలిచినా ఓయి అని పలికే పరమశివుడుపరమానందంతో ఆ మూడు మాట్లాడే నేర్పు లేని జీవాలను తనలో లీనం చేసుకొన్నాడు. ఆ భక్తప్రాణుల మహోదాత్త మైన జీవనశైలిని అందరికీ తెలియచేయడానికే తాను శ్రీకాళహస్తీశ్వరుడయి నిలిచాడు.
అనాగరికుడని, అడవి సుందరుడని పేరుపొందిన తిన్నడు వచ్చి అజ్ఞానం తనలో నిండుకుండలా ఉన్నా పరమశివునిపై అచంచలమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంపొందించుకొని తన పుక్కిట పట్టిన నీటితో శివలింగాన్ని కడిగి, తాను వొంటిన కట్టి తెచ్చిన పూవులను చల్లి తన దోసిట తెచ్చిన పచ్చి మాంసాన్ని పెట్టి తినమనిన తిన్ననికి మోక్షమిచ్చాడా కరుణాంతరుడైన అభయంకరుడు.
అటువంటి త్రినేత్రుడి అర్థాంగి శివాని. ఆ తల్లిని
గుణాతీతా! సర్వాతీతా! శమాత్మికా!
బంధూక కుసుమ ప్రఖ్యా! బాలా!
లీలావినోదినీ! సుమంగళీ! సుఖకరీ!
సువేషాఢ్యా! సువాసినీ! శోభనా! అని కీర్తించినా అంతగా ఆనందించని ఆ లలనామణి తన భర్తను స్తుతిస్తూ మహాకామేశ మహిషీ! శ్రీమత్త్రిపురసుందరీ శ్రీ శివా! శివశక్యైక రూపిణీ శ్రీ లలితాంబికా అని స్తుతిస్తే చాలట మహదానందంతో తన భక్తుని అక్కున చేర్చుకొంటుంది. అఖిలైశ్వర్యాలను కలిగిస్తుంది. ఆనందాన్ని భక్తుని ఇంట వాసం చేసేట్లుచేస్తుంది. అందుకే ఆ ఆది దంపతులైన తల్లి తండ్రులకు నమస్కరించి
పంచ సంఖ్యోపచారిణీ! శాశ్వతీ!
శాశ్వతైశ్చర్యా! శర్మదా!్ధన్యా
శంభు మోహినీ! ధరాధర సుతా!
ధర్మిణీ ! ధర్మవందితా! లోకాతీతా!
త్రిపురాసురుని మట్టుపెట్టిన త్రిపురాసురేశ్వరుని గెల్చుకున్న నేత్రాలతో శోభించే కల్యాణకారిణి నమో నమో అర్ధనారీశ్వరా నమో నమో అని కీర్తిస్తేచాలు అఖిల భువనాలు ఆనందనందనవనాలు అవుతాయి.

- జి. కల్యాణి