త్వరలో లోఫర్ పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ముకుంద’, ‘కంచె’ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో వరుణ్‌తేజ్, దిశాపటానీ జంటగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘లోఫర్’. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వివరాలను నిర్మాత సి.కళ్యాణ్ తెలియజేస్తూ ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన దక్కిందని, తక్కువ సమయంలో పది లక్షల క్లిక్స్ వచ్చాయని, ప్రస్తుతం బిజినెస్ కూడా క్రేజీగా జరుగుతోందని అన్నారు. డిసెంబర్ 7న హైదరాబాద్‌లో పాటల్ని విడుదల చేస్తామని, మదర్ సెంటిమెంట్‌తోపాటు హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ పక్కామాస్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రవితేజకు ‘ఇడియట్’, మహేష్‌కు ‘పోకిరి’, చరణ్‌కు ‘చిరుత’, ఎన్టీఆర్‌కు ‘టెంపర్’ ఎలాగో వరుణ్‌తేజ్‌కు ‘లోఫర్’ సినిమా అలాంటి ఇమేజ్ ఇస్తుందని అన్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 18న విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌కశ్యప్, కెమెరా: పి.జి.విందా, ఆర్ట్: విఠల్ కోసనం, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, నిర్మాతలు: సి.వి.రావు, శే్వతలానా, వరుణ్, తేజ, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.