రాష్ట్రీయం

మెడికల్ హబ్‌గా ఏపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 19: ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. పెనమలూరు మండలం తాడిగడపలో శుక్రవారం ఎల్‌వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌లో తేజ్‌కోహ్లి ఐ బ్యాంక్‌ను ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు, అకాడమీ ఆఫ్ ఐ కేర్ ఎడ్యుకేషన్ సెంటర్‌ను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ నిరుపేదలకు అధునాతన వైద్య చికిత్సను అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఇందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు తోడు ప్రైవేట్ భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు.
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఎల్‌వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సామాజిక దృక్పథంతో ముందుకురావటం అభినందనీయమన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ముందుకు తీసుకురావటంతో ప్రజల్లో గుర్తింపు వచ్చిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వైద్య, ఆరోగ్య రంగాలు మెరుగుపరచి పేదవారికి అధునాతన చికిత్సను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలపట్ల ప్రజల్లో అపోహలను తొలగించి సేవలు పొందేందుకు ముందుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఎన్‌టిఆర్ వైద్యసేవల్లో భాగంగా విజన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నామని మంత్రి తెలిపారు. ఈ కేంద్రంలో కళ్లకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి చికిత్స చేస్తామన్నారు.