రాష్ట్రీయం

మాజీ ఎంపి, మాజీ మంత్రికి నాన్ బెయిలబుల్ వారెంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 26: కులం పేరుతో దూషించడమే కాకుండా దౌర్జన్యం చేసిన కేసులో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపి హర్షకుమార్, మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ తదితరులకు విశాఖ నాలుగవ అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శుక్రవారం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. 2004లో ఎంపిగా ఉన్న హర్షకుమార్‌కు విశాఖలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా కృష్ణ స్వరూప్ అనే వ్యక్తిపై హర్షకుమార్ అనుచరులు దాడి చేసినట్టు కేసు నమోదయింది. నేరారోపణ ఎదుర్కొంటున్న హర్షకుమార్, కోండ్రు మురళి, అప్పటి ఎమ్మెల్యే కుంభా రవిబాబు వాయిదాలకు హాజరుకానందున నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి.