ఆంధ్రప్రదేశ్‌

మీ సేవలో ఐఎఫ్‌ఆర్ పాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 22: ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)ను తిలకించే అవకాశాన్ని సాధారణ ప్రజానీకానిక కల్పించనున్నారు. వచ్చే నెల 5 నుంచి 8వరకూ ఎనిమిది రోజుల పాటు ఆర్‌కె బీచ్ కేంద్రంగా ఐఎఫ్‌ఆర్ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. దీనికి సంబందించి పాసుల జారీకి జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేయగా, తొలి రోజు తీవ్ర అంతరాయమేర్పడింది. ఆధార్ కార్డుల ద్వారా ఐఎఫ్‌ఆర్ పాసులు మంజూరు చేయాలని నిర్ణయించగా, మీసేవ కంప్యూటర్లలో వీటికి సంబంధించి సాఫ్ట్‌వేర్ మొరాయించడంతో ఆలస్యంగా ప్రక్రియ మొదలు కాలేదు. అయితే కలెక్టరేట్‌లో దీనిపై జెసితో సమీక్షించిన అనంతరం మధ్యాహ్నం నుంచి వీటి జారీని చేపట్టాలని భావించారు. సుమారు 50 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు ఈ వేడుకల్లో వివిధ రకాల విన్యాసాలు చేయనున్నాయి. గతంలో ముంబై కేంద్రంగా భారతదేశంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ జరిగింది. చాలా కాలం తర్వాత విశాఖలో ఈ మెగా ఈవెంట్ నిర్వహించడంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కనుంది. వేడుకలకు భారత రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. అయితే ఐదు రోజుల పాటు వేడుకలు జరుగుతున్నప్పటికీ ప్రధాన వేడుక ఫిబ్రవరి 7న జరగనుంది. దీనికోసం ఇప్పటికే ఆర్‌కె బీచ్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజున వేడుకలను తిలకించేందుకు ప్రత్యేక పాసులను జారీ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 132 మీసేవ కేంద్రాల్లో పాసుల జారీ ప్రక్రియ చేపట్టారు. ఒక్కో కేంద్రానికి 500 వరకూ పాసులను కేటాయించారు. పాసు తీసుకోదలచిన వారు ఆధార్ కార్డు జెరాక్స్ కాపీతో మీసేవ కేంద్రాలను సంప్రదించాల్సి ఉంటుంది. అయితే తొలి రోజు ఐఎఫ్‌ఆర్ పాస్‌ల జారీకి మీసేవ కేంద్రాలకు చేరుకున్న ప్రజానీకానికి తీవ్ర నిరాశ ఎదురైంది. పాసుల జారీకి సంబంధించి సాంకేతిక లోపం కారణంగా మధ్యాహ్నం వరకూ ఎటువంటి పాసులు జారీచేసేందుకు వీలు కాలేదు. అయితే మీసేవ కేంద్రాల్లో ఆధార్ జెరాక్స్‌లను సేకరించి పాసులు ఇస్తామని నిర్వాహకులు వెల్లడించడంతో వెళ్లిపోయారు. సాయంత్రానికి సాంకేతిక లోపాన్ని సవరించిన అధికారులు పాసుల జారీని ప్రారంభించారు.

జివిఎంసి బడ్జెట్‌కు ఆమోదం
* రూ.118.5 కోట్ల మిగులు
* జీత భత్యాలకు రూ.350 కోట్లు
* హార్టీకల్చర్‌కు పెరిగిన కేటాయింపులు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 22: మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను అంచనా బడ్జెట్‌కు ఆమోదం లభించింది. పాలకవర్గం లేకపోవడంతో జివిఎంసికి ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్న మున్సిపల్ పరిపాలన, మరియు పట్టణాభివృద్ధి శాఖలు ప్రిన్సిపల్ కార్యదర్శి కరికాల వలవన్ బడ్జెట్‌కు ఆమోదముద్ర వేశారు. బడ్జెట్ ప్రతిపాదనలతో కమిషనర్ ప్రవీణ్‌కుమార్ శుక్రవారం హైదరాబాద్ వెళ్లి ప్రత్యేకాధికారితో చర్చించి ఆమోదింపచేశారు. గత ఆర్థిక సంవత్సరం ప్రారంభ నిల్వ రూ.84.34 కోట్లు కాగా, ఈ సారి పన్నులు, ఇతర మార్గాలతో పాటు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లను కలిపి రూ.2,758.05 కోట్లు ఆదాయం లభిస్తుందని అంచనా వేశారు. గతేడాది మిగులుతో కలిపి రూ.2,842.39 కోట్లుగా లెక్కకట్టారు. అలాగే సిబ్బంది జీతభత్యాలు, ఇతర కార్యక్రమాలకు రూ.2,723.85 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. రూ.118.54 కోట్ల మిగులతో రూపొందించిన అంచనా బడ్జెట్‌కు ప్రత్యేకాధికారి కరికాల వనవన్ ఆమోదం తెలిపారు. తాజా బడ్జెట్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అమృత్ పథకం కింద రూ.60 కోట్లు వస్తాయని అంచనా వేశారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ కింద కేంద్రం ఇచ్చే నిధులు మరో రూ.30 కోట్లు ఆదాయాన్ని ఆశిస్తున్నారు. ఇక ఖర్చుల విషయానికొస్తే సిబ్బంది జీతభత్యాల కింద రూ.350 కోట్లు, మంచినీటి సరఫరాకు రూ.175 కోట్లు, భూగర్భ మురుగునీటి వ్యవస్థకు రూ.100 కోట్లు, విద్యా విభాగానికి రూ.30 కోట్లు, ప్రజారోగ్య విభాగానికి రూ.175 కోట్లు కేటాయించారు. ఇక హార్టీకల్చర్ విభాగానికి అత్యధికంగా రూ.35 కోట్లను కేటాయించారు. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్న 20 స్మార్ట్‌సిటీల్లో తప్పక స్థానం లభిస్తుందన్న ధీమాతో ఉన్న జివిఎంసి రెండేళ్లకు గాను కేంద్రం నుంచి వచ్చే రూ.200 కోట్లను అంచనా బడ్జెట్‌లో చేర్చారు. అయితే కేంద్రం ఎంపిక చేసే 20 స్మార్ట్‌సిటీలను ప్రకటన జనవరి 26న ప్రకటించనుంది. అయితే ఇంకా ఎంపిక ప్రక్రియ పూర్తి కాకుండా కేంద్రం నుంచి వచ్చే నిధులను బడ్జెట్‌లో ప్రతిపాదించడం గమనార్హం.

సామాజిక న్యాయం కోసం పోరాడతాం
* ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు జాతీయ ప్రధాన కార్యదర్శి అనీరాజా
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 22: దేశంలో మహిళల వికాసానికి, సామాజిక న్యాయం కోసం పోరాడతామని భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు) జాతీయ ప్రధాన కార్యదర్శి అనీరాజా అన్నారు. 20వ జాతీయ మహాసభలను పురస్కరించుకొని శుక్రవారం విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించిన మూడోరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ దేశంలో మతవాద శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఆర్థిక అసమానతలపై ప్రత్యక్ష కార్యాచరణకు ప్రతినిధుల నుంచి సలహాలు తీసుకుంటున్నామని ఎపి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వి జయలక్ష్మి అన్నారు. మహిళా లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వారి గాథలను ఈ సందర్భంగా వివరించారు. ఒడిశాలో మనోరమ, రాజస్థాన్‌లో సవరతీబాయి పోరాటాలు మహిళలకు స్ఫూర్తినిస్తాయన్నారు. బహుళ జాతి కంపెనీలకు భూములు ఇచ్చేది లేదంటూ మనోరమ సాగించిన పోరాటం కారణంగా పాస్కో కంపెనీ వెనుదిరగాల్సి వచ్చిందన్నారు. రాజస్థాన్‌లో సర్పంచ్‌గా గెలిచిన సవరతిబాయి నిరక్షరాస్యురాలైనప్పటికీ పంచాయతీని ప్రగతిపథంలో నడిపించారని వివరించారు. నేడు సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగించేందుకు కృషి జరగాలన్నారు. ప్రభుత్వ లోపభూయిష్ట విధానాల వల్ల అట్టడుగు వర్గాలు నష్టపోవాల్సి వస్తొందన్నారు. మహిళలపై వివక్ష, లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయన్నారు. వివక్షను రూపుమాపి మహిళా సాధికారత కోసం సభలో తీర్మానించినట్టు ఆమె తెలిపారు. దాంతోపాటు ఉపాధి హామీ కల్పించాలని మహాసభ డిమాండ్ చేస్తోందన్నారు. భూమి మహిళల పేరు మీద ఉండాలన్నారు. ఈ సమావేశంలో విద్యావేత్త నూర్‌జహీర్, ఎపి మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దుర్గ్భావానీ, జిల్లా కార్యదర్శి విమల, తదితరులు పాల్గొన్నారు.

దోషులను కఠినంగా శిక్షించాలి
* ఎయులో బంద్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 22: ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి వి.రాహుల్ మృతికి సంబంధించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి లోవరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. అలాగే హెచ్‌సియు వైస్ ఛాన్సలర్ అప్పారావు, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలను పదవుల నుంచి తొలగించాలన్నారు. రోహిత్ కుటుంబానికి రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఇప్పటికైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని నిందితులను అరెస్టు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎపి యువజన, విద్యార్థి జెఎసి రాష్ట్ర చైర్మన్ ఎ.మహేష్ మాట్లాడుతూ రోహిత్ మరణం విద్యార్థి లోకానికి తీరని లోటు అన్నారు. ఇప్పటి వరకు నిందితులను పట్టుకోకపోవడంతో అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్ నగర అధ్యక్ష, కార్యదర్శులు జి.నగేష్‌కుమార్, సింహాద్రి, జగత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

రహదారి భద్రతను పాటించాలి
* పోస్టర్‌ను విడుదల చేసిన మంత్రి అయ్యన్న
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 22: రహదారి భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు గోడపత్రికను ఆవిష్కరించారు. శుక్రవారం నగరంలోని రామ్‌నగర్‌లో 27వ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రహదారి భద్రతలను పాటించి ప్రమాదాలను నివారించడానికి సహకరించాలన్నారు. అదే విధంగా ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని, కార్లు నడిపే వారు సీటు బెల్టు ధరించాలన్నారు. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్న రహదారి భద్రతా వారోత్సవాల వాహనాన్ని మంత్రి అయ్యన్న జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఒ ఎహెచ్ ఖాన్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు సిహెచ్ శ్రీనివాస్, డి.సంజీవరావు, గణేష్‌రెడ్డి, సత్యంనాయుడు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

నిర్ధేశిత సమయంలో రిటర్న్‌లు సమర్పించాలి
* టిడిఎస్ విధానంపై అవగాహన
* ఆదాయ పన్నుశాఖ జాయింట్ కమిషనర్ శేష శ్రీనివాస్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 22: ఆదాయ పన్నుకు సంబంధించి మూలధనంపై విధించే త్రైమాసిక రిటర్న్‌లను నిర్ధేశిత సమయంలో చెల్లించాలని ఆదాయ పన్నుశాఖ విశాఖ రేంజ్ జాయింట్ కమిషనర్ వై.శేష శ్రీనివాస్ అన్నారు. ఆదాయ పన్నుశాఖ ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం తిరిగి ప్రజా సంక్షేమానికి, సంక్షేమ పథకాలకు వినియోగిస్తుందన్నారు. ఆదాయపన్ను శాఖ విశాఖ రేంజి ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ అంకోశా హాల్లో టిడిఎస్‌పై అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఆదాయపు పన్ను శాఖ ద్వారా వసూలు చేస్తున్న పన్నులో దాదాపు 40 శాతం టిడిఎస్ ద్వారానే వసూలు చేస్తున్నామన్నారు. టిడిఎస్ విధానంలో ముందస్తుగా మూలధనంపై పన్నును వసూలు చేస్తున్నారని వివరించారు. పన్ను వసూలు చేయడం, దానిని ప్రభుత్వ ఖాతాలో జమ చేయడం ఎంత ముఖ్యమో, రిటర్న్‌లు దాఖలు చేయడం అంతే ముఖ్యమన్నారు. రిటర్న్ ఆన్‌లైన్‌లో నమోదైతేనే లబ్ధిదారునికి మేలు చేకూరుతుందన్నారు. ఈ విషయమై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదాయ పన్నుశాఖ డిప్యూటీ కమిషనర్ కె.రవి, ఆదాయ పన్నుశాఖ అధికారి కె.తులసీదాసు, డి.సంధ్యారాణి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

మైనర్ పిల్లల పాస్‌పోర్ట్ కోసం తల్లిదండ్రుల రానక్కర్లేదు
* ప్రభుత్వ ఉద్యోగుల సమాచార్‌లేఖలో లోపాలు
* పాస్‌పోర్ట్ ప్రాంతీయ కార్యాలయ అధికారి చౌదరి
విశాఖపట్నం, జనవరి 22: మైనర్ పిల్లల పాస్‌పోర్ట్ కోసం తల్లిదండ్రులిద్దరు కార్యాలయానికి రానక్కర్లేదని పాస్‌పోర్ట్ ప్రాంతీయ కార్యాలయం అధికారి ఎన్‌ఎల్‌పి చౌదరి తెలిపారు. మర్రిపాలెం కార్యాలయంలో శుక్రవారం కలిసిన ‘ఆంధ్రభూమి’తో ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు ఇద్దరూ ఖచ్చితంగా తమ కార్యాలయానికి రావాలనే నిబంధనలుండేవన్నారు. అయితే వీరి సౌలభ్యం దృష్ట్యా నిబంధనలను కాస్త సరళతరం చేయడంతో ఇక నుంచి వీరిద్దరూ రానక్కర్లేదన్నారు. ఇకపై అనెగ్జర్-హెచ్‌ను సమర్పించే సమయంలో తల్లిదండ్రులిద్దరూ రాలేని పరిస్థితుల్లో, వారిద్దరిలో ఎవరో ఒకరు ఇద్దరి పాస్‌పోర్ట్‌లతో హాజరుకావచ్చన్నారు. పాస్‌పోర్టు కోసం ధరఖాస్తు చేసుకున్న నుంచి వీటిని పొందే వరకు ఏ విధమైన నిబంధనలు పాటించాలి? ఏఏ పత్రాలు అవసరం ఉంటుందనే అంశాలపై తరచూ అభ్యర్ధులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దీనిలోభాగంగా గతంలో అనేకసార్లు ‘పాస్‌పోర్ట్ మేళా’లు ఉండేవన్నారు. పాస్‌పోర్ట్ కోసం ధరఖాస్తు చేసుకునే విద్యార్ధుల సమస్యలు తగ్గించడంలో భాగంగా కాలేజీల్లో చైతన్యపరిచే కార్యక్రమాలు జరిపామన్నారు. ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలో పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమాలు గత ఏడాది కాలంగా విస్తృతంగా నిర్వహిస్తున్నామన్నారు. 2015లో ఏడు పాస్‌పోర్ట్ శిబిరాలు నిర్వహించామని, ఇందులో అమలాపురం, టెక్కలి, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, ఏలూరు, కాకినాడ, చిలకలూరిపేటలున్నాయన్నారు. ఇందులో రాజమండ్రి పాస్‌పోర్ట్ అవగాహనా శిబిరాన్ని అక్కడ పార్లమెంటు సభ్యులు మురళీమోహన్, ఏలూరులో శిబిరాన్ని ఎంపీ మాగంటి బాబు, చిలకలూరిపేట శిబిరాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి పత్తిపాటి పుల్లారావులు ప్రారంభించారన్నారు. ఈ విధంగా జరిపిన ఏడు శిబిరాల ద్వారా 2546 ధరఖాస్తులు వచ్చాయన్నారు. పాస్‌పోర్ట్ కోసం ధరఖాస్తులు చేసుకునే అభ్యర్ధులకు సకాలంలో సేవలందించేందుకు వీలుగా గత ఏడాది ఆగస్టు 25వ తేదీ నుంచి మర్రిపాలెం పాస్‌పోర్ట్ ప్రాంతీయ కార్యాలయంలోనే పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని (పిఎస్‌కె) అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. దీంతోపాటు మురళీనగర్‌లో మరో పిఎస్‌కె గత కొనే్నళ్ళుగా సేవలందిస్తూనే ఉందన్నారు. ప్రతిరోజు దీని ద్వారా 900 ధరఖాస్తులు అందుతున్నాయన్నారు. ఇందులో 300 మందికి రోజుకీ అపాయింట్‌మెంట్ ఇస్తుండగా, వీటిలో 20 వరకు తత్కాల్, 80 పిసిసి ఉన్నాయన్నారు. అలాగే త్వరలో పశ్చిమగోదావరి భీమవరంలో ఉగాది నాటికి పాస్‌పోర్ట్ సేవా లఘు కేంద్రాను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. దీని ద్వారా 250 మంది ప్రతిరోజు ధరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉంటుందన్నారు. అభ్యర్ధులకు ఎటువంటి సందేహాలు వచ్చిన తమ కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు.

గత ఏడాది 2 లక్షల 20 వేల పాస్‌పోర్టులు జారీ
తమ కార్యాలయ పరిధిలో గత ఏడాదిలో 2, 20, 158 పాస్‌పోర్టులు జారీ చేశామని విశాఖ పాస్‌పోర్టు ప్రాంతీయ కార్యాలయ అధికారి ఎన్‌ఎల్‌పి చౌదరి తెలిపారు. పాస్‌పోర్టుల కోసం మొత్తం 2.26 లక్షల దరఖాస్తులు అందాయని తెలిపారు. వీటి ద్వారా 36 కోట్ల 51 లక్షల 11 వేల పైచిలుకు రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. పోలీసు విచారణ కేవలం 11 రోజుల వ్యవధిలోనే పూర్తయ్యిందన్నారు. పోలీసు విచారణలో భారతదేశంలోనే విశాఖ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. తత్కాల్ ద్వారా పాస్‌పోర్ట్‌ను పొందాలనుకునే వారికి కేవలం ఒకటి నుంచి మూడు రోజుల్లోపే పోలీసు విచారణ పూర్తవుతుందన్నారు. 2014 సంవత్సరం కంటే గత ఏడాది పాస్‌పోర్ట్‌ల జారీ శాతం భారీగా పెరిగిందన్నారు. దీనిని ఈ ఏడాది మరింతంగా పెంచేందుకు వీలుగా పాస్‌పోర్ట్ జారీ విధానాన్ని సరళతరం చేస్తున్నట్టు స్పష్టం చేశారు. 2014లో పాస్‌పోర్ట్ జారీకి 21 నుంచి 45 రోజులు పట్టేదని, అటువంటిది ప్రస్తుతం కేవలం 10 నుంచి 15 రోజుల్లోపు పాస్‌పోర్ట్‌లను అందజేయగలుగుతున్నామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పాస్‌పోర్ట్ లఘు సేవా కేంద్రం త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.

ముఖ్యమైన మూడు ఎక్స్‌ప్రెస్‌లకు థర్డ్ ఏసి కోచ్‌లు ఏర్పాటు
* ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు అదనపు సౌకర్యం
విశాఖపట్నం, జనవరి 22: ఏడాదిలో ప్రతిరోజు రద్దీగా ఉండే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ళకు అదనపు కోచ్‌లను తగిలించేందుకు ఈస్ట్‌కోస్ట్‌రైల్వే వాల్తేరుడివిజన్ కమర్షియల్ విభాగం అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. దీనిలోభాగంగా దశలవారీగా కొన్ని వంతున ఈ సదుపాయం కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ విధంగా తొలి దశలో విశాఖపట్నం-్భగల్‌కోటి (18573/18574)లోను, అలాగే విశాఖపట్నం-కొల్లాం-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (18567/18568)లో మరో థర్డ్ ఏసి కోచ్‌లు ఏర్పాటు చేసినట్టు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం.యల్వెందర్‌యాదవ్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. వీటితోపాటు విశాఖపట్నం-టాటానగర్-విశాఖపట్నం (18516/18515)కు థర్డ్ ఏసి కోచ్‌ను తగిలిస్తున్నట్టు ఆయన తెలిపారు. విశాఖపట్నం-్భగత్ కి కోటి (18573) ఎక్స్‌ప్రెస్‌కు తగిలించే థర్త్ ఏసి కోచ్ వచ్చే నెల 11వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుందన్నారు. అలాగే భాగత్ కి కోటి-విశాఖపట్నం (18574) ఎక్స్‌ప్రెస్‌కు తగలించనున్న థర్డ్ ఏసి కోచ్ వచ్చేనెల 13వ తేదీ నుంచి అందుబాటులో ఉండనుందన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ రైలులో సెకండ్ ఏసి-1, థర్డ్ ఏసి-3, స్లీపర్ క్లాస్‌లు-9, జనరల్-6, సెకండ్ క్లాస్ సిటింగ్ కమ్ లగేజీ కోచ్‌లు-1, సెకండ్ క్లాస్ సిటింగ్ ఫర్ డిజాబుల్డ్ కమ్ లేగేజీ కోచ్-1, పాంట్రీ కార్-1 కలిపి మొత్తం 22 కోచ్‌లతో ఇది నడువనుంది.

దక్షిణమధ్యరైల్వే జిఎంతో అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి భేటీ
* పలు సమస్యలపై చర్చ
విశాఖపట్నం, జనవరి 22: దక్షిణమధ్యరైల్వే జనరల్ మేనేజర్ రవీందర్ గుప్తాతో శుక్రవారం అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు రవీందర్‌గుప్తాతో భేటీ అయ్యారు. దక్షిణమధ్యరైల్వే పరిధిలోకి వచ్చే అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో వసతుల కల్పన, పలు సమస్యల గురించి చర్చించారు. అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో సూపర్‌పాస్ట్‌రైళ్ళను నిలుపుదల చేయాలని, హౌరా-యశ్వంత్‌పూర్, నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లను నిలపాల్సిందిగా సూచించారు. అలాగే యలమంచిలి వద్ద జన్మభూమి,రత్నాచల్ రైళ్ళను నిలపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి రైల్వేస్టేషన్, యలమంచిలి రైల్వేస్టేషన్ల ఆధునీకరణ చేయాలని, అదనపు బుకింగ్ కౌంటర్ల, ఫుట్‌ఓవర్‌బ్రిడ్జి, ఫుడ్‌ఫ్లజా-ను 24 గంటలు నిర్వహించాల్సిందిగా కోరారు. అదనపు ప్లాట్‌ఫారాల నిర్మాణం, కోచ్‌ల ఇండికేషన్ బోర్డులు, లిఫ్ట్‌లు, సైన్‌బోర్డులు వంటివి కల్పించాల్సిందిగా పేర్కొన్నారు. ప్రధానంగా యలమంచిలి మునిపాలిటీలకు,రైల్వేకు సంబంధించి మరుగుకాలువలు నిర్మాణం చేపట్టడం, రాజమండ్రి, విశాఖ ఇంటర్నల్ రైళ్ళు, ఉదయం 9 గంటలకు తిరిగి సాయంత్రం ఐదు గంటలకు ఉండే విధంగా నడపాలన్నారు. పాసింజర్ రైల్వే రిజర్వేషన్ కేంద్రాన్ని చోడవరం, మాడుగుల, నర్సీపట్నంల్లో ఏర్పాటు చేయాలన్నారు. లంకెలపాలెం అంతర బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సిందిగా కోరారు.

మన్యంలో అక్షరాస్యతను పెంపొందించండి
అధికారులకు గిరిజన మంత్రి రావెల ఆదేశం
పాడేరు, జనవరి 22: విశాఖ మన్యంలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అధికారులను ఆదేశించారు. ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారులు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో ప్రస్తుతం కేవలం ఎనిమిది శాతం మాత్రమే అక్షరాస్యత ఉన్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్షరాస్యత శాతంలో మన్యం ఎంతో వెనుకబడి ఉందని, దీనిని పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అన్నారు. గిరిజన యువతీ, యువకులకు వివిధ వృత్తులపై నైపుణ్యాభివృద్ధి కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక శిక్షణనిచ్చి వారికి వివిధ రంగాలలో ఉపాధి కల్పన కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. గిరిజన ఉప ప్రణాళిక కింద ప్రతి సంవత్సరం రెండు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నామని, ఈ నిధులతో గిరిజన గ్రామాలలో వౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గిరి గోరుముద్దలు, గిరి పుత్రిక కల్యాణ యోజన వంటి పథకాలకు విస్తృత ప్రచారం కల్పించి వాటిని పకడ్భందీగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, ఎన్.టి.ఆర్. విద్యోన్నతి, ఎంటర్ ప్రెన్యూర్ షిప్, కాంట్రాక్టర్స్ డెవలప్‌మెంట్ పథకాల అమలు ద్వారా గిరిజన యువతకు అవసరమైన అవగాహన కల్పించి వారి అభిరుచులకు అనుగుణంగా వివిధ రంగాలలో ప్రావీణ్యులు చేయాలని ఆయన సూచించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాలలో వంట చెరకుకు బదులుగా గ్యాస్‌నే వినియోగించాలని, మార్చి నెలాఖరు నాటికి దీని అమలును పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. రాయితీపై గ్యాస్ సరఫరా, గ్యాస్ ఏజెన్సీల ఏర్పాటు వంటి విషయాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించనున్నట్టు మంత్రి చెప్పారు. విశాఖ ఏజెన్సీలో సికిల్‌సెల్ ఎనీమియాపై మంత్రి అడిగిన ప్రశ్నకు ప్రాజెక్టు అధికారి హరినారాయణన్ సమాధానమిస్తూ గిరిజన ప్రాంతంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 49 వేల మంది విద్యార్థులకు మొదటి దశలో గత అక్టోబర్ నెలలో రక్తపరీక్షలు చేపట్టగా కేవలం 22 మందికి మాత్రమే 6 నుంచి 8 గ్రాముల హిమోగ్లోబిన్ కలిగి రక్తహీనతతో బాధపడుతున్నట్టు గుర్తించామని చెప్పారు. వీరికి తగిన వైద్యం చేయించినట్టు ఆయన తెలిపారు. రెండో దశలో 8 నుంచి 9 గ్రాముల హిమోగ్లోబిన్ కలిగిన విద్యార్థులను గుర్తించడం కోసం 80 వేల మందికి రక్తపరీక్షలు త్వరలో నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. ఈ వ్యాధి కేవలం వాల్మీకి తెగ గిరిజన బాలల్లో మాత్రమే అధికంగా ఉంటుందని, మిగిలిన తెగల విద్యార్థులలో లేదని ప్రాజెక్టు అధికారి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధ్‌రెడ్డి, విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్వాతిరాణి, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్లు పద్మ, చినవీరభద్రుడు, గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజనీర్ పద్మజ, పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

ద్విచక్ర వాహనం బోల్తా
* ఒకరు మృతి, మరొకరికి గాయాలు
గొలుగొండ,జనవరి 22: మితిమీరిన వేగంతో ద్విచక్ర వాహనం ప్రయాణిస్తూ బోల్తాపడి ఒక వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ దుర్ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం తమరానపాలెం గ్రామానికి చెందిన ఈరె శ్రీనివాస్ (24) గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చీడిగుమ్మల బ్రిడ్జి సమీపంలో మృతి చెందాడు. జరిగిన సంఘటను చీడిగుమ్మల గ్రామానికి చెందిన కొందరు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఎస్సై జోగారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగికి చెందిన శ్రీనుబాబు అతనితో పాటు మరొక వ్యక్తి కల్యాణం గురువారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో స్వగ్రామమైన తమరాన పల్లి నుండి విశాఖ జిల్లా కోటవురట్ల మండలం కొడవటిపూడి గ్రామానికి బయలు దేరాడన్నారు. కొడవటిపూడిలో చెరకు కూలీ పనినిమిత్తం అడ్వాన్స్ డబ్బుల కోసం బయలు దేరి వెళ్ళి అక్కడి నుండి తిరుగు ప్రయాణంలో చీడిగుమ్మల సమీపంలో అధిక వేగంతో బైక్ బోల్తా కొట్టడంతో శ్రీనుబాబు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. కల్యాణానికి స్వల్పగాయాలయ్యాయి. ఈవిషయం కుటుంబ సభ్యులకు చేరడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జోగారావు తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

డొంకరాయి జల విద్యుత్ కేంద్రంలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి
సీలేరు, జనవరి 22: డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లో ఆయిల్ అప్ అండ్ డౌన్ కావడంతో యూనిట్‌కు మరమ్మతులు తలెత్తాయని ముందుస్తుగా డొంకరాయి జల విద్యుత్ కేంద్రంలో ఇంజనీర్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచి మరమ్మతు పనులు చేపట్టారు. రోజుకు ఈ జలవిద్యుత్ కేంద్రంలో సుమారు 20 నుంచి 25 లక్షల విలువ చేసే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులకు గురి కావడంతో 10 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి నిలిచివేశారు. ఈ సందర్భంగా ఎడిఇఇ శ్రీనివాసరావు స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులకు గురైంది. ఈవిషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారి ఆదేశాలతో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసి మరమ్మతులను పాల్వంచకు చెందిన మార్వెల్ కంపెనీతో మరమ్మతు పనలు చేయిస్తున్నామన్నారు.

జెన్‌కో ఛీప్ ఇంజనీర్ పర్యటన
సీలేరు,జనవరి 22: ఎపి జెన్‌కో ఛీప్ ఇంజనీర్ కేశవస్వామి సీలేరు, బలిమెల్లో శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా సీలేరు సమీపంలో ఉన్న గుంటవాడ రిజర్వాయర్‌ను పరిశీలించారు. గేజ్‌ల కిందభాగంలో ఉన్నగ్యాలరీల్లో నీరు లీకేజ్ అవుతున్నదీ, లేనిదీ స్థానిక ఇన్‌చార్జ్ ఎస్‌ఇ విఎల్ రమేష్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బలిమెల చేరుకుని బలిమెలలో నీటి నిల్వలపై ఒడిశా అధికారులతో చర్చించారు. ఆంధ్రా వాటాగా ఎంత నీరు ఉందని, ఇప్పటి వరకు ఎంత నీటిని వాడుకున్నది వారితో చర్చించారు. గోదావరి డెల్టాకు సీలేరు నదికి బలిమెల నది ఎంత పంపారు, ఎంత నిల్వ ఉందనే విషయమై స్థానిక జెన్‌కో ఇంజనీర్ విఎల్ రమేష్‌ను వివరాలను అడిగారు. అనంతరం సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో మొదటి యూనిట్ మరమ్మతుల స్థితి గతులపై డివిజన్ ఇంజనీర్ సుధాకర్‌ను అడిగి తెలుసుకున్నారు. మరమ్మతులు పూర్తయ్యాయని వారు తెలిపారు. యూనిట్లు పనితీరు సక్రమంగా ఉండాలన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు యూనిట్లు కండిషన్‌లో ఉండేట్లు ఇంజనీర్లు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జలవిద్యుత్ కేంద్రంలో సిఇ కేశవస్వామి సమీవేశమయ్యారు. జలవిద్యుత్ కేంద్రంలో నాలుగు యూనిట్ల నుంచి విద్యుత్ విషయమై ఆరా తీశారు. ఇంజనీర్లు, కార్మికులు సమష్టిగా కృషి చేసి విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని వారికి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ సూపరెంటెండెంట్ ఇంజనీర్ రమేష్, డిఇ సుధాకర్ సుధాకర్, ఇంజనీర్లు, కార్మికులు పాల్గొన్నారు.

స్వచ్చ్భారత్‌లో దేశానికే అనకాపల్లి ఆదర్శం కావాలి
* స్వచ్చ్భారత్ ప్రచార కర్త సుద్దాల ఉవాచ
అనకాపల్లి, జనవరి 22: స్వచ్ఛ్భారత్ అమలులో దేశానికే అనకాపల్లి ఆదర్శం కావాలని స్వచ్చ్భారత్ జాతీయ ప్రచార కర్త సుద్దాల అశోక్‌తేజ ఆకాంక్షించారు. ఇంట్లోని తల్లికి మించిన స్వచ్చ్భారత్ మరొకరు లేరని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వేకువజామునే ఇంటిని ఊడ్చి ముందు కల్లాపి చల్లి ముగ్గులు వేయడం ద్వారా ఒక ఆదర్శమైన స్వచ్చ్భారత్ కార్యకర్తగా తల్లి నిలుస్తుందని ఆయన కొనియాడారు. జీవిఎంసి అనకాపల్లి జోనల్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ నేతృత్వంలో అనకాపల్లిలో శుక్రవారం జరిగిన స్వచ్ఛ్భారత్ కార్యక్రమానికి సుద్దాల ముఖ్య అతిధిగా విచ్చేసి ఉపన్యశించారు. తొలుత మెయిన్‌రోడ్డులోని సుంకరి మెట్ట జంక్షన్ నుండి స్వచ్చ్భారత్ ర్యాలీని ప్రముఖ సినీ గేయరచయిత సుద్దాల ప్రారంభించారు. మెయిన్‌రోడ్డు గుండా ఇక్కడి రావుగోపాలరావు కళాక్షేత్రం వరకు సాగిన ర్యాలీలో పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థిని విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా పాల్గొని స్వచ్ఛ్భారత్‌లో మేము సైతం అంటూ ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సినీ గేయ రచయిత సుద్దాల మాట్లాడుతూ దేశభక్తి అంటే ఏమిటని తన తల్లిని అడిగితే స్కూల్‌లో కనిపించిన చిత్తు కాగితాన్ని వెంటనే చెత్తబుట్టలో వేయడానికి మించిన దేశభక్తి లేదనే పరమార్ధాన్ని అతి తక్కువ పదాల్లో చెప్పారన్నారు. స్వచ్చతను కోరుకున్న మహాత్మాగాంధీ ఆశయ సాధనలో భాగంగానే ప్రధాని నరేంద్రమోడీ స్వచ్చ్భారత్ కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టారన్నారు. మహాత్మాగాంధీ కళ్లద్దాలను స్వచ్ఛ్భారత్‌కు చిహ్నాలుగా చూపి ఈ కార్యక్రమానికి ఒక పరమార్ధాన్ని ప్రధాని తీసుకువచ్చారన్నారు. ఈ సందర్భంగా పరిశుభ్రత ఆవశ్యకతను తెలియజేస్తూ సుద్దాల ఆలపించిన పలు గేయాలు సభికులను బాగా అలరించాయి. ఈ సందర్భంగా బెల్లం పట్టణంగా అభిమానం పంచే ప్రాంతంగా అనకాపల్లిని సుద్దాల తెలియజేసారు. తాను ఆలపించి లోఫర్‌తోపాటు భద్రాచలం, ఠాగూర్ తదితర చిత్రాల్లోని గీతాలను ఆలపించారు. ప్రధాన కూడళ్లలో చెత్తవేస్తున్న వారికి చప్పెట్ల కొట్టి అభినందించడం ద్వారా వారిలో వినూత్న మార్పుకు విద్యార్థులే శ్రీకారం చుట్టాలన్నారు. స్వచ్ఛ్భారత్ కార్యక్రమం అమలుకు అనకాపల్లిలో లభిస్తున్న స్పందన తనకెంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ఎక్కడా తాను ఇటువంటి స్పందన కలిగిన సభను చూడలేదన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ అనకాపల్లి పట్టణంలో పరిశుభ్రత అమలు జరిగేలా చూడాల్సిన బాధ్యతను విద్యార్థులు చేపట్టాలన్నారు. ప్రజలు సహకరిస్తేనే ఈ కార్యక్రమం విజయవంతమవుతుందన్నారు. జీవిఎంసి జోనల్ కమీషనర్ సుభానీ మాట్లాడుతూ అనకాపల్లి పట్టణంలో బహిరంగ మరుగుదొడ్లను నిర్మూలించడంతోపాటు శానిటేషన్ సక్రమంగా చేయడం ద్వారా 65శాతం పరిశుభ్రతను సాధించగలిగామన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన స్వచ్ఛ్భారత్ నిర్వాహక కమిటీ కన్వీనర్ డాక్టర్ కెకెవిఎ నారాయణరావు మాట్లాడుతూ స్వచ్చ్భారత్ కార్యక్రమం అమలుకు ఎమ్మెల్యే పీలా గోవింద్ చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారని కొనియాడారు. డైట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ దాడి రత్నాకర్, హిమశేఖర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ కొణతాల జనార్ధన్, మాజీ ఎంపీపి నిమ్మదల త్రినాధరావు తదితరులు ఈ సమావేశంలో ప్రసంగించారు. డిఎస్పి పురుషోత్తం, తహశీల్దార్ భాస్కర రెడ్డి, ఎంపీపిలు పెంటకోట సుబ్బలక్ష్మి, కొణతాల సావిత్రి, డిఆర్‌డిఎ పిడి సత్యసాయి శ్రీనివాస్, డాక్టర్ సత్యవతి, విష్ణుమూర్తి, పట్టణ దేశం అధ్యక్షులు బుద్ధ నాగజగదీశ్వరరావు, తెలుగుయువత అధ్యక్షులు మళ్ల సురేంద్ర, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బుద్ద సత్యనారాయణ, వెంకటేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్చ్భారత్ జాతీయ ప్రచార కర్త సుద్దాల అశోక్‌తేజను ఎమ్మెల్యే పీలా గోవింద్ ఘనంగా సత్కరించారు.

వేధింపులకు గురిచేస్తున్న వడ్డీవ్యాపారిపై మహిళల ఫిర్యాదు
చోడవరం, జనవరి 22: అన్యాయ అక్రమాలకు పాల్పడుతూ తమను నిత్యం వేధిస్తున్న వడ్డీ వ్యాపారి నుండి ఆదుకోవాలని బాధిత మహిళలు గురువారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. వడ్డాదికి చెందిన వడ్డీ వ్యాపారి తాము తీసుకున్న రుణాలు చెల్లించినప్పటికీ రాయించుకున్న ప్రాంసరీ నోట్లు తిరిగి ఇవ్వకపోవడమే కాకుండా అతనివద్ద చీటిల పేరుతో దాచుకున్న సొమ్మును కూడా కాజేస్తున్నాడని, అర్ధరాత్రి వరకు తమను అనవసరంగా వేధిస్తున్నాడని మండలంలోని జెన్నవరం, రామజోగిపాలెం, గాంధీగ్రామాలకు చెందిన మహిళలు గురువారం సాయంత్రం ఎస్‌ఐ రమణయ్యకు ఫిర్యాదులు చేసారు. రామజోగిపాలెం గ్రామానికి చెందిన వేదాలశెట్టి భ్రమరాంబ లక్షా 30వేల రూపాయల రుణం తీసుకుని తీర్మానం చేసినప్పటికీ హామీగా ఉంచిన చెక్కు తనకుమార్తె శైలజ చీటి వేసుకున్న రెండులక్షల రూపాయలను అన్యాయంగా తనవద్దనే ఉంచుకుని ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించింది. అలాగే జెన్నవరంకు చెందిన గాడి ఈశ్వరమ్మ (20వేల రూపాయలు), రామజోగిపాలేనికి చెందిన కె. రమణమ్మ (60వేల రూపాయలు), జెన్నవరానికి చెందిన గట్టా నాగమణి (పదివేల రూపాయలు) అప్పుగా తీసుకుని తమకు ఆర్థిక ప్రయోజనాలు కలిసిరాక నెలనెలా వడ్డీలు కడుతున్నప్పటికీ నిత్యం తమకు వడ్డీలకు చక్రవడ్డీలు వేస్తూ రుణాలు తీర్చాలని వడ్డీ వ్యాపారి వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఎస్‌ఐ ముందు వాపోయారు. అలాగే ప్రతీరోజు గ్రామాల్లో పొగాకు వ్యాపారం పేరుతో తిరుగుతూ మహిళలకు అధిక వడ్డీలకు రుణాలను అందజేసి ఇచ్చిన పదిరోజులకే తమ అప్పుకు సంబంధించిన వడ్డీ ఎప్పుడు చెల్లిస్తారంటూ అసభ్యపదజాలంతో దూషిస్తున్నాడని, ఇతర గ్రామాల్లో ఉన్న తమ బంధువుల వద్దకు వెళ్లి అభాసుపాలు చేస్తానని తమను బెదిరిస్తున్నాడంటూ బాధిత మహిళలు ఎస్‌ఐకు ఫిర్యాదు చేసి క