రాష్ట్రీయం

మళ్లీ ఆమరణ దీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ ఆత్మహత్య ఘటనపై విద్యార్థులు మళ్లీ ఆమరణ దీక్ష చేపట్టారు. ఆదివారం అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏడుగురు విద్యార్థులు ఆమరణ దీక్షలో కూర్చుకున్నారు. విద్యార్థి సంఘాల జెఏసి దీక్షలకు సంఘీభావం తెలిపింది. హెచ్‌సియూ విద్యార్థులకు ఆందోళనకు ఉస్మానియా యూనివర్శిటీ జెఏసి మద్దతు ప్రకటించింది. విసి అప్పారావును సస్పెండ్ చేయాలని, కేంద్రమంత్రి దత్తాత్రేయను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఓయూలో నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. మరోపక్క విద్యార్థి మృతిపై న్యాయ విచారణ జరిపించి తగు న్యాయం చేయాలని గుల్బర్గా ఎంపీ, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఆదివారం హెచ్‌సియూలో విద్యార్థుల ఆమరణ దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ విద్యార్థి సంఘాల జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన విద్యార్థుల ఆమరణ దీక్ష శనివారం భగ్నమైన విషయం తెలిసిందే. పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి ఆసుపత్రులకు తరలించి దీక్షా శిబిరాన్ని ఎత్తివేశారు. అయితే ఆదివారం విద్యార్థులు మళ్లీ ఆమరణ దీక్షకు పూనుకోవడంతో వర్శిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు, విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వైస్ చాన్సలర్ రాజీనామా చేసేంతవరకు తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు భీష్మించుకు కూర్చున్నారు. వర్శిటీ వైస్ చాన్సలర్ కె అప్పారావు సెలవుపై వెళ్లారు. ఆయన స్థానంలో ఇన్‌చార్జి విసిగా శ్రీవాస్తవ్‌కు బాధ్యతలు అప్పగించారు. రోహిత్ ఆత్మహత్య సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుండటంతో ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్టు తెలిసింది. అయితే విసిగా శ్రీవాస్తవ్ నియామకాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. విద్యార్థుల బహిష్కరణ కమిటీలో శ్రీవాస్తవ్ సభ్యుడుగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఇన్‌చార్జి విసిగా బాధ్యతలు ఇవ్వడం సరికాదని హెచ్‌సియూ విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉద్యమానికి విలువలేకుండా చేస్తున్నారని ఆరోపించారు. అసలే మా కడుపులు మండిపోతుంటే శ్రీవాస్తవ్‌కు ఇన్‌చార్జి విసిగా బాధ్యలు అప్పగించి మరోసారి మంటపెట్టారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతోమంది ప్రొఫెసర్లు ఉండగా శ్రీవాస్తవ్‌నే ఎందుకు నియమించారని విద్యార్థులు ప్రశ్నించారు. తమ దీక్షకు మద్దతుగా చెన్నై నుంచి కొంత మంది విద్యార్థులు వచ్చారని, రేపు కర్నాటక, కేరళ రాష్ట్రాల నుంచి విద్యార్థులు వస్తున్నారని తమ ఉద్యమం తీవ్ర రూపం దాల్చనుందని చెప్పారు. విసి అప్పారావు, ఇన్‌చార్జి విసి శ్రీవాస్తవ్‌లకు రోహిత్ ఆత్మహత్యకు సంబంధం ఉందని ఆరోపిస్తూ తమ ఆందోళనను తీవ్రతరం చేయనున్నట్టు విద్యార్థి సంఘాల జెఎసి ప్రకటించింది.
పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా: ఖర్గే
సెంట్రల్ వర్శిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై పార్లమెంట్‌లో లేవనెత్తుతానని, విద్యార్థి మృతిపై న్యాయ విచారణ జరిపించి తగు న్యాయం చేయాలని గుల్బర్గా లోక్‌సభ సభ్యుడు, ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఆదివారం హెచ్‌సియూలో విద్యార్థుల ఆమరణ దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. విద్యార్థి రోహిత్ ఆత్మహత్య సంఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆందోళనకు ఆయన సంఘీభావం ప్రకటించారు. దేశంలోనే ప్రముఖ యూనివర్శిటీగా పేరొందిన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం విచారకరమన్నారు. విద్యార్థి మృతిపై ఎలాంటి విచారణ జరుపకుండా ఏదో కొంత పరిహారాన్ని ప్రకటించి చేతులు దులుపుకోవడం సమంజసం కాదన్నారు. వర్శిటీలో కుల వివక్ష స్పష్టంగా కనబడుతుందని, కులాలకతీతంగా విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి సారించినప్పుడే వర్శిటీల మనుగడ సాధ్యమవుతుందన్నారు. గతంలో కూడా ఈ వర్శిటీలో ఎంతో మంది ఆత్మహత్యకు పాల్పడినట్టు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయాన్ని పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావనకు తెచ్చి విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని మల్లికార్జున్ ఖర్గే భరోసా ఇచ్చారు.