ఆంధ్రప్రదేశ్‌

మార్చి 10న కార్మిక వ్యతిరేక దినం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, ఫిబ్రవరి 12: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై భారీ ఎత్తున పోరాటం చేయడానికి అన్ని కార్మిక సంఘాలను ఏకం చేస్తున్నట్లు ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు జి సంజీవరెడ్డి స్పష్టం చేశారు. పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా మార్చి 10వ తేదీన కార్మిక వ్యతిరేక దినంగా పాటించాలని, ఏప్రిల్‌లో రెండు రోజుల పాటు సమ్మె చేయాలని నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు. శుక్రవారం సింహాచలంలో శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్న ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ కార్మికుల పట్ల ప్రధాని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పనికి ఆహార పథకం మంచి ఫలితాలనిచ్చిందని ఆయన అన్నారు. ఈ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అసంఘటిత కార్మికులు, రైతుకూలీలకు ఎంతో మేలు కలిగిందని చెప్పారు. ఈ పథకాన్ని రద్దు చేయాలని చూడడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర పన్నుతోందని విమర్శించారు.