రాష్ట్రీయం
మావోల భారీ డంప్ లభ్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 15 February 2016
భద్రాచలం, ఫిబ్రవరి 14: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గజియాబంద్, దక్షిణ ఒడిశా సరిహద్దుల్లో ఆదివారం పోలీసులు భారీగా మావోయిస్టుల డంప్‌ను కనుగొన్నారు. రాయ్‌పూర్ ఐజీ సింహ్ సాహెబ్ కథనం ప్రకారం మావోయిస్టుల కదలికల నేపథ్యంలో బస్తర్ ప్రాంతంలో పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. డిఆర్‌జీ, ఎస్టీఎఫ్ బలగాలు చందామెట్టా, తులసీడోంగ్రి మధ్య కొండలపై అణువణువూ తనిఖీలు నిర్వహించాయి. తనిఖీల్లో 2 పెద్ద ప్లాస్టిక్ పీపాలు, 6 స్టీలు డబ్బాల్లో నిల్వ ఉంచిన మావోయిస్టుల డంప్ దొరికింది. భారీ సంఖ్యలో ఆయుధాలు, ఎలక్ట్రికల్ సామాన్లు లభ్యమయ్యాయి.