కమల్‌తో కలసి నటించడం అదృష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోయిన్ మధుశాలిని
జాతీయ నటుడు కమల్‌హాసన్ హీరోగా రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వంలో రాజ్‌కమల్ ఫిలింస్, గోకులం మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ‘చీకటి రాజ్యం’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా త్రిష, మధుశాలిని నటించారు. ఇందులో కీలక పాత్ర పోషించిన మధుశాలిని చెప్పిన విశేషాలు...
మంచి రెస్పాన్స్
చీకటి రాజ్యం సినిమా విడుదలైన రోజునుండి అంతటా మంచి టాక్ రావడంతో చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మళ్లీ మళ్లీ చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. నేను నటించిన సినిమాకు ఇంత మంచి టాక్ రావడం ఇదే ఫస్ట్‌టైమ్. కమల్‌హాసన్ చాలా రోజుల తరువాత చేసిన తెలుగు సినిమాలో నేను నటించడం మర్చిపోలేని అనుభూతి.
అది కథకు అవసరం
ఈ సినిమాలో కమల్‌హాసన్‌తో ముద్దు సన్నివేశంలో నటించాను. సాధారణంగా ప్రతి సినిమాలో ముద్దు సన్నివేశమంటే రొమాంటిక్ సీన్‌లో మాత్రమే చూపిస్తారు. కానీ ఇందులో కథకు అవసరం కాబట్టి ఆ సన్నివేశంలో నటించాను. ఏదైనా కథలో వుంటేనే ఆయన కూడా కనెక్ట్ అవుతారు. మొత్తానికి సినిమా చూసినవాళ్ళందరికీ కమల్‌గారితో ముద్దు సీన్ కన్విన్సింగ్‌గా అనిపించింది.
ఆ పాత్ర ప్రాముఖ్యత
కమల్ అంటే నాకు చాలా ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పాను. ఒక సినిమాకు ఆడిషన్స్ చేస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్లాను. ఆ సమయంలో ఆయన్ను కలిసినపుడు ఈ పాత్రకు నేనైతే సూట్ అవుతానని నన్ను ఎంపిక చేశారు.
మర్చిపోలేని అనుభూతి
జాతీయ నటుడు కమల్‌తో నటించడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. నటనకు పెట్టింది పేరు ఆయన. ఆయనతో చేస్తున్నపుడు కొన్ని సన్నివేశాలు నాకు కొంచెం కష్టంగా అనిపించాయి. ఆయన ఎప్పుడూ మొదటి సినిమా చేస్తున్నాను అనే తపనతో పనిచేస్తారు. ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకుని తోటి నటీనటులకు జాగ్రత్తలు చెబుతారు. ఆయనదగ్గర చాలా నేర్చుకున్నాను.
తదుపరి చిత్రాలు
నేను చేసే తదుపరి చిత్రాలు తమిళ, మలయాళ భాషల్లో ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే వీటికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తా.

-శ్రీ