ఆంధ్రప్రదేశ్‌

ఏపి అసెంబ్లీలో ‘మగాడు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విచ్చలవిడిగా అభ్యంతరకర పదాల వాడకం * రికార్డులనుంచి తొలగించిన స్పీకర్
హైదరాబాద్, మార్చి 14: అవిశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరుగుతున్న సందర్భంగా సభ్యులు ఉపయోగించిన కొన్ని మాటలు సభలో గందరగోళాన్ని సృష్టించాయి. దాంతో అలాంటి పదాలను రికార్డుల నుండి తొలగించినట్టు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. గజరాజు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయని జగన్ చేసిన వ్యాఖ్యకు ఆర్ధిక మంత్రి యనమల అభ్యంతరం వ్యక్తం చేశారు. కుక్కలు అనే మాట సరైనది కాదని, ఒకవేళ ఆ స్టేట్‌మెంట్‌కు వైకాపా ఫిక్స్ అయితే అది మామూలు గజరాజు కాదని, పిచ్చి ఏనుగు అని అన్నారు. పిచ్చి ఏనుగు వెంట కుక్కలు పడటం సహజమేనని వ్యాఖ్యానించారు. బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జగన్ ఆర్ధిక టెర్రరిస్టు అని అన్నారు. అంతకుముందు కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నువ్వు మగాడివి అయితే, మగతనం అంటూ ఉంటే సవాలును స్వీకరించాలని పేర్కొనగా, జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఖబడ్దార్ జగన్ అంటూ సంబోధించారు. అయితే ఈ వ్యాఖ్యలు ఒకపక్క చర్చ జరుగుతుండగానే ఆన్‌లైన్‌లో టీవీ చానళ్లలో ప్రసారం అయ్యాయి. సభ్యులు తమ మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని స్పీకర్ సభ్యులకు సూచించారు.