పాటల మహల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్ధాంశ్, రాహుల్, తేజశ్విని హీరోహీరోయిన్లుగా లక్ష్మణ్‌వర్మ దర్శకత్వంలో కళానిలయ క్రియేషన్స్ పతాకంపై బి.రమేష్ నిర్మించిన ‘సినీ మహల్’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో శనివారం విడుదలయ్యాయి. శేఖర్‌చంద్ర సంగీతం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న దర్శకుడు మారుతి సీడీని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శేఖర్‌చంద్ర మంచి పాటల్ని అందించాడని, ట్రైలర్స్ బాగున్నాయని, అన్నిరకాల అంశాలు కలగలిపిన చిత్రమిదని అన్నారు. తప్పకుండా ఈ సినిమా యూనిట్‌కు మంచి పేరు తెస్తుందన్నారు. దర్శకుడు లక్ష్మణ్‌వర్మ మాట్లాడుతూ ‘తాను దర్శకుడిగా మారడానికి కారణం పార్ధు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం రాజు. అన్నిరకాల కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన సినిమా ఇది. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ దొరై వెంకట్ అద్భుతంగా తెరకెక్కించాడు’ అన్నారు. హీరో సిద్ధాంశ్ మాట్లాడుతూ ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్ అన్నారు. నిర్మాత పార్ధు మాట్లాడుతూ ‘ఈ కథకు తగ్గట్టుగానే సినీ మహల్ అనే టైటిల్ పెట్టాం. టూరింగ్ టాకీస్‌కు సంబంధించిన సినిమా ఇది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. (చిత్రం) తేజశ్విని